Coconut Water And Lemon : చాలామంది, నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లు కానీ తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు రెండిట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. వీటి వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయాన్ని చూద్దాం. వేసవి వచ్చినప్పుడు లేదంటే నీరసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, కొబ్బరినీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లను కానీ చాలామంది తాగుతూ ఉంటారు. శరీరంలో అలసట, బలహీనతని తొలగించడానికి కొబ్బరి నీళ్లు లేదంటే నిమ్మరసం రెండు కూడా బాగా ఉపయోగపడతాయి.
కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రుచిగా ఉంటాయి. పైగా రిఫ్రిష్ గా మనల్ని మారుస్తాయి. శరీరాన్ని కూడా తేమగా ఉంచడానికి, రెండు సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో పోషకలు కూడా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ తో పాటుగా సోడియం కూడా కొబ్బరి నీళ్లలో ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ గా మార్చడానికి, కొబ్బరి నీళ్లు బాగా సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగితే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
గుండెకి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని తీసుకుంటే కూడా, అద్భుతమైన ఫలితం ఉంటుంది. నిమ్మకాయలులో ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి తో పాటుగా పొటాషియం, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మొదలైన పోషకాలు ఉంటాయి. నిమ్మరసం తాగితే చాలా మేలు కలుగుతుంది. అయితే, నిమ్మరసంలో చక్కెరని కలపకూడదు.
కేవలం నిమ్మరసంలో నీళ్లు వేసుకుని తీసుకోండి. లేదంటే ఉప్పు వేసుకోవచ్చు. ఎక్కువగా నిమ్మకాయ రసం తాగకూడదు. కేవలం ఒక్క నిమ్మకాయ రసం తీసుకుంటే తాగచ్చు. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం రెండు కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. ఈ రెండిటి వల్ల హాని కలగదు. కాబట్టి రెండూ కూడా తీసుకోవచ్చు. ఎలాంటి నష్టాలు కూడా ఉండవు.