lifestyle

వార్నీ.. ఇదేం ప‌ద్ధ‌తిరా నాయ‌నా.. ప్రైవేటు బ‌స్సుల‌లో వ్య‌భిచారం..!

వ్య‌భిచారం చేసేందుకు విటులు కొత్త మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఇంత‌కు ముందు హోట‌ల్స్ లేదా లాడ్జిల‌కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు వారికి ఒక కొత్త మార్గం దొరికింది. ఇంత‌కీ ఏంటా మార్గం.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా. అవేనండీ.. ప్రైవేటు బ‌స్సులు, అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ఇదంతా ఒక పెద్ద మాఫియాలా న‌డిపిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ప్రైవేటు బ‌స్సుల్లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌ని సాక్షాత్తూ ట్రావెల్ కంపెనీలే చెబుతున్నాయి.

కావ‌ల్సిన అమ్మాయిల‌ను విటులు ముందుగానే బుక్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలో అమ్మాయికి, విటుడికి క‌లిపి ముందుగానే బ‌స్సులో వెనుక సీట్ల‌లో బెర్త్ బుక్ చేస్తారు. ఇంకేముంది రాత్రి పూట ఇద్ద‌రూ బ‌స్సు ఎక్కి అస‌లు ప‌ని ముగించేస్తారు. అయితే అలాంటి స‌మయంలో కొంద‌రు కేక‌లు పెడుతున్నార‌ట‌. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. కానీ వారిని నిల‌దీస అడిగితే తాము వ్య‌భిచారం చేయ‌డం లేద‌ని, తాము ఇరువురి ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఆ ప‌నిచేస్తున్నామ‌ని అంటున్నార‌ట‌. మీదుగా ద‌బాయిస్తున్నార‌ట కూడా. దీంతో అటు ట్రావెల్ కంపెనీలు, ఇటు పోలీసులు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. వారు వ్య‌భిచారం చేస్తున్నారు అనే ప్రూఫ్‌ల‌ను ప‌ట్టుకోలేక‌పోతున్నారు. కార‌ణం.. అంతా ఆన్‌లైన్‌లోనే ఈ దందా జ‌రుగుతోంది.

private travels worrying about their busses

ఈ మేర‌కు టైమ్స్ సౌ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈమ‌ధ్య కాలంలో ఇలాంటి వ్య‌భిచారం ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అయితే ఎక్కువగా ఈ త‌ర‌హా వ్య‌భిచారం మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌కు వ‌చ్చే బ‌స్సుల్లోనే జ‌రుగుతోంద‌ట‌. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు, చెన్నై ఇలా ఆయా న‌గ‌రాల మ‌ధ్య తిరిగే బ‌స్సుల్లోనే ఇలాంటి వ్య‌భిచారం చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి పోలీసులకు ప‌క‌డ్బందీగా ఆధారాలు ల‌భిస్తాయా.. లేదా.. చూడాలి.

Admin

Recent Posts