lifestyle

మన శరీర భాగాలపై బల్లి పడటం శుభ శకునమా?

సాధారణంగా మనం ఏదైనా పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మన పై బల్లి పడటం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా బల్లి మీద పడినప్పుడు కొందరికి ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. బల్లి పడటం దేనికి సంకేతం? ఏదైనా అశుభం జరగనుందా.. అనే సందేహం వెంటాడుతుంది.అయితే శరీరంలో ఏ భాగం పై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

మనం భోజనం చేస్తున్న సమయంలో బల్లి శబ్దం చేస్తూ ఉంటే శుభం కలుగుతుంది. బల్లి మన నుదిటిపై పడితే చాలా అలా శుభ పరిణామమని, మనకు ఆస్తులు కలిసొచ్చే యోగం ఉంటుంది. అదే ముక్కు పై పడితే అదృష్టం కలిసి వస్తుంది. బల్లి ముఖం పై పడితే మనకు రుచికరమైన భోజనం ఉన్నట్లు సంకేతం. ఎడమ బుగ్గ మీద బల్లి పడితే పాత మిత్రులను కలుసుకుంటారు. మెడ పై పడితే సమాజంలో కీర్తి గౌరవం లభిస్తాయి. కుడి చేతి పై పడితే ధనప్రాప్తి కలుగుతుంది. కుడి పాదం పై బల్లి పడితే అనుకోని ప్రయాణాలు కలుగుతాయి.

what happens if lizard fall on body

ఈ విధంగా మన శరీరం పై బల్లి పడటం వల్ల మనకు జరిగే కొన్ని సంకేతాలనీ పండితులు తెలియజేస్తున్నారు. అయితే కొందరికి దోషాలు కూడా ఏర్పడవచ్చు. అయితే మన శరీరం పై బల్లి పడితే వెంటనే వెళ్లి శుభ్రంగా కాళ్లు చేతులు మొహం కడుక్కుని మన ఇంట్లో ఉన్నటువంటి బల్లి పటాన్ని నమస్కరించుకోవటం వల్ల మన పై ఉన్న దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరైతే కంచిలో ఉన్నటువంటి బంగారు బల్లిని తాకి ఉంటారో అలాంటి వారిని తాకినా కూడా బల్లి దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts