హెల్త్ టిప్స్

Salt Water : రోజూ ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిదట.. ఎందుకో తెలుసా..?

Salt Water : మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పును సరిపోయినంతగా తీసుకుంటే ఏమీ కాదు, కానీ అది మోతాదుకు మించితేనే మనకు ఇతర సమస్యలు వస్తాయి. అయితే ఉప్పు కలిపిన నీటిని నిత్యం ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రలేమి, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందట. ఈ క్రమంలో నిత్యం ఉప్పు నీటిని తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు నీటిని ఉదయాన్నే తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఆ నీటిలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, నిర్మాణానికి, దృఢత్వానికి ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంలోనూ ఉప్పు నీరు బాగానే పనిచేస్తుంది. దీంట్లో అధికంగా ఉండే సల్ఫర్, క్రోమియం తదితర పదార్థాలు చర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి. అంతేకాదు చర్మం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. ఉప్పు నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. ఇది శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. దీని వల్ల మనసుకు ప్రశాంతత చేకూరి నిద్ర సులభంగా పడుతుంది.

drinking salt water in the morning is very beneficial

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను బయటికి పంపడంలో ఉప్పు నీరు బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని చెడు బాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఉప్పు నీటిని తరచూ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు ఉప్పు నీటిలో ఉన్నాయి. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలోనూ ఉప్పు నీరు బాగానే ఉపయోగపడుతుంది. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పు నీరు తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది.

అయితే ఉప్పు నీళ్ల‌ను త‌యారు చేసేందుకు గాను ఉప్పును ఎక్కువ‌గా వాడ‌రాదు. పావు టీస్పూన్ లో స‌గం ఉప్పు వేయాలి. ఎక్కువ ఉప్పు వేస్తే విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఈ నీళ్ల‌ను తాగేముందు జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు వ‌స్తాయి.

Admin

Recent Posts