lifestyle

గృహప్రవేశం రోజు పాలను ఎందుకు పొంగిస్తారో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా పాలు పొంగించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ విధంగా పాలు పొంగించడానికి గల కారణం ఏమిటనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నూతన గృహప్రవేశం చేసేవారు పాలను ఎందుకు పొంగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుట్టింది. అదేవిధంగా విష్ణుమూర్తి పాల సముద్రం పై పవళించి ఉంటాడు. కనుక నూతన గృహప్రవేశం చేసేటప్పుడు మన ఇంట్లో పాలు పొంగించడం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, సంతానం అభివృద్ధి చెందుతాయనే నమ్మకంతో కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.

why milk is boiled during gruha pravesham

నూతన గృహప్రవేశం చేసేవారు ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడాలని ఆ ఇంటికి చెందిన ఆడపిల్లలచేత పాలు పొంగించి ఆ పాలతో చక్కెర పొంగలి తయారు చేయించి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాలతోపాటు గోమాతను కూడా మన ఇంట్లోకి ఆహ్వానిస్తారు. గోమాత సకల దేవతల స్వరూపంగా భావిస్తారు. అటువంటి గోమాత ఇంట్లోకి అడుగు పెట్టడం వల్ల సకల దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని భావిస్తారు. అందుకోసమే నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగించడం, గోమాతను ఇంట్లోకి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.

Admin

Recent Posts