lifestyle

అతని ప్రేమను వదులుకున్న ఆమె ఎంత దురదృష్టవంతురాలో కదా.!

ఓ పేదవాడైన అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించాడు… ఒకరోజు తన ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పాడు… అప్పుడు ఆ అమ్మాయి… చూడు, నీ నెల జీతం నా ఒక్క రోజు పాకెట్ మనీ అంత ఉండదు… ఎలా అనుకున్నావ్, నేను నిన్ను ప్రేమిస్తానని… నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి… నన్ను చేసుకోవాలంటే అతనికో స్టేటస్ ఉండాలి… అందుకే నన్ను మర్చిపోయి, నీ లెవల్ కి తగ్గ వాళ్ళని చూస్కో… అని చెప్పింది కానీ అతను ఆ అమ్మాయిని అంత ఈజీగా మర్చిపోలేకపోయాడు.

( After 10 years ) ఒక షాపింగ్ మాల్ లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఆ అమ్మాయి, Hey u, how r u….? నాకు పెళ్లయింది, నీకు తెలుసా? మా వారి సాలరీ ఎంతో 2 Lakhs per month, నిన్ను పెళ్లి చేసుకునుంటే నాకు ఇంత స్టాటస్ వచ్చేదా….? అని అతనితో అంది !( ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు తిరిగాయి)

women left her true lover know the truth

ఇంతలో ఆమె భర్త అక్కడికి వచ్చాడు….ఆ అబ్బాయిని చూసి, . . . . Sir, మీరు ఇక్కడ….? ఈమె నా భార్య ప్రియా… ప్రియా…! ఈయన మా బాస్… One Of The Billionaire … ప్రియా, నీకు తెలుసా… Sir కి ఇంత స్టేటస్ ఉండి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు… Sir ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంట… కానీ అప్పుడు sir కి ఆస్తి లేదని అమ్మాయి కాదంది… ఎంత unlucky girl కదా…! Sir ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు…. ఈ రోజుల్లో Sir లాంటి గొప్ప ప్రేమికులు ఎంతమంది ఉంటారు… అని తన భార్యకు చెప్పాడు.( ఆమె తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది)

Admin

Recent Posts