Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు అన్నం తిన‌వ‌చ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

Diabetes : డ‌యాబెటిస్ ఉన్న వారు అన్నం తిన‌వ‌చ్చా.. అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. వైద్యులు కూడా వారికి అన్నం, తీపి ప‌దార్థాలు, బ్రెడ్ వంటి వాటిని త‌క్కువ‌గా తీసుకోమని చెబుతుంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ డ‌యాబెటిస్ ఉన్న వారు కొంద‌రు అన్నాన్ని తీసుకోవ‌డం పూర్తిగా మానేస్తూ ఉంటారు. డ‌యాబెటిస్ ఉన్న వారు అంద‌రి లాగా అన్ని ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. కానీ ముందు డ‌యాబెటిస్ గురించి తెలుసుకుంటే తరువాత కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని అన్నీ తిన‌వ‌చ్చు.

మ‌నం తీసుకునే ఆహారం మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేదై ఉండాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. మ‌నం తీసుకునే ఆహారాన్ని 6 వ‌ర్గాలుగా విభ‌జించి తీసుకోవాలి. అవి కూర‌గాయ‌లు, పాలు, పండ్లు, మాంసం, మాంసానికి బ‌దులుగా తీసుకునే ఆహార ప‌దార్థాలు, కొన్ని ర‌కాల ధాన్యాలు, గింజ‌లు, దుంపలు. ఈ విధంగా మ‌నం తీసుకునే ఆహారాన్ని విభ‌జించాలి. అలాగే మ‌నం తీసుకునే ఆహారంలో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో చూసుకోవాలి. త‌రువాత కొన్ని వ్యాయామాల‌ను చేస్తూ నిర‌భ్యంత‌రంగా ఎంత అన్నం తిన‌వ‌చ్చో అంత అన్నం తిన‌వ‌చ్చు.

can we eat rice if we have Diabetes
Diabetes

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నాన్ని తిన‌డం వ‌ల్ల అది చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది. మ‌ధుమేహం ఉన్న స్త్రీలు 45 నుండి 60 గ్రాములు, పురుషులు 60 నుండి 75 గ్రాములు ప‌రిమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న అన్నాన్ని తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అర క‌ప్పు అన్నంలో 50 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబ‌ట్టి 45 నుండి 60 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్న అర క‌ప్పు అన్నాన్ని తీసుకోవాలి. పాలు, పండ్లు, కూర‌గాయ‌ల‌ను కూడా భోజ‌నంతోపాటు తీసుకోవ‌చ్చు. రెండోసారి కూడా ఇదే విధంగా తీసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైతే షుగ‌ర్ స్థాయిల‌ను పెంచ‌ని ఆహారాల‌ను తీసుకోవ‌చ్చు.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం మ‌ధుమేహం ఉన్న వారు సాధార‌ణ బియ్యంతోపాటు ముడి బియ్యంతో వండిన అన్నాన్ని కూడా తీసుకోవ‌చ్చు. ముడిబియ్యంలో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ని నియంత్రించ‌డంతోపాటు ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డంలో కూడా ముడి బియ్యం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ విధంగా వైట్ రైస్ ను, బ్రౌన్ రైస్ ను త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకానీ వాటిని తింటే షుగ‌ర్ పెరుగుతుంద‌నే అపోహ‌తో వాటిని తీసుకోవ‌డం పూర్తిగా మానేయ‌కూడ‌దు.

Share
D

Recent Posts