ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి వల్ల చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే డయాబెటిస్ ఆరంభంలో ఉన్నప్పుడే పాదాల్లో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా షుగర్ వచ్చిందో, రాలేదో తెలుసుకోవచ్చు. దీంతో ముందుగానే జాగ్రత్త పడితే డయాబెటిస్ రాకుండా ఉంటుంది. మరి షుగర్ ఆరంభంలో ఉన్నప్పుడు పాదాల్లో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పాదాల్లో తిమ్మిర్లు బాగా వస్తున్నా, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తున్నా.. అది షుగర్ వ్యాధికి సూచన అయి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయరాదు.
2. కొందరికి పాదాల్లో గాయాలు, దెబ్బలు తగిలినా ఏమాత్రం నొప్పిగా అనిపించదు. ఇది కూడా షుగర్‌కు ఆరంభ లక్షణమే.
3. షుగర్ వ్యాధి ఉన్నవారిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీని వల్ల నడుస్తున్నప్పుడు పాదాల్లో నొప్పులు వస్తాయి.
4. షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముఖ్యంగా కాళ్లకు అయిన గాయాలు త్వరగా మానవు. పుండ్లు కూడా మానేందుకు సమయం పడుతుంది. ఇలా జరుగుతుంటే దాన్ని షుగర్‌గా అనుమానించాలి.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా చికిత్స తీసుకుంటే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే ఆరంభంలోనే డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.