వైద్య విజ్ఞానం

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే!

జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి పిల్ల‌వాడిని అడిగినా చెబుతాడు. నిత్యం మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు జీర్ణాశ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దీంట్లోనే మ‌న రెండో మెద‌డు ఉంటుంద‌ట‌. అది కూడా మ‌న ఎమోష‌న్స్‌కు అనుగుణంగా స్పందిస్తుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా మేము చెప్పింది నిజ‌మే. దీన్ని సాక్షాత్తూ వైద్యులే ధ్రువీక‌రిస్తున్నారు. అయితే ఆ మెదడు నాడీ క‌ణాల రూపంలో ఉంటుంద‌ట‌. అంతేకానీ త‌ల‌లో ఉన్న మెద‌డులా ప్ర‌త్యేకమైన అవ‌య‌వంలా ఉండ‌ద‌ట‌. కాగా జీర్ణాశ‌యంలో ఉన్న ఈ మెద‌డు దాదాపుగా త‌ల‌లో ఉన్న మెదడులాగే ప‌నిచేస్తుంద‌ట‌.

do you know that our body has also second brain

మన జీర్ణాశ‌యంలో ఉండే మెదడుకు ఆలోచించే స్వ‌భావం అయితే లేదు. కానీ, బ‌య‌టికి మనం క‌న‌బ‌రిచే ప‌లు ఫీలింగ్స్‌కు, మ‌న ఎమోష‌న్స్‌కు స్పందిస్తుంద‌ట‌. అంతెందుకు ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం బాగా భ‌య‌ప‌డుతున్నామ‌నుకోండి, క‌డుపులో అదో ర‌కంగా అవుతుంది. అంటే క‌డుపులో ఉన్న మెద‌డు స్పందిస్తుంద‌న్న‌మాట. దీన్ని సైంటిస్టులు కూడా ధ్రువీక‌రించారు. మ‌నం భ‌య‌ప‌డుతుంటే జీర్ణాశ‌యం ద‌గ్గ‌ర ఉన్న కండ‌రాల్లోని ర‌క్తం అంతా దూరంగా పోతుంద‌ట‌. అందుకే ఆ స‌మ‌యంలో మ‌న‌కు క‌డుపులో అదో ర‌కంగా అనిపిస్తుంద‌ట‌.

అంతేకాదు త‌ల‌లో ఉన్న మెద‌డు, జీర్ణాశ‌యంలో ఉన్న మెదడు రెండూ ప‌ర‌స్ప‌రం ఎప్ప‌టికప్పుడు సంభాషించుకుంటాయ‌ట‌. అందుకోసం 30 ర‌కాల నాడీ కణాలు ఎప్ప‌టికీ ప‌నిచేస్తూనే ఉంటాయ‌ట‌. అందుకే మ‌న‌కు ఆక‌లిగానే మెద‌డుకు సిగ్న‌ల్ అంది అది మ‌న‌కు తెలుస్తుంది, ఆహారం తిన‌గానే ఇక చాలు అనే సంకేతం క‌డుపు నుంచి మెద‌డుకు అంది అప్పుడు కూడా సిగ్న‌ల్ చూపిస్తుంది. ఆశ్చ‌ర్యంగా ఉంది కదూ! అయితే మరి మీ రెండో మెద‌డుకు కూడా స‌రిగ్గా ఆహారం అందించండి మ‌రి!

Admin

Recent Posts