Diabetes Symptoms : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరిలో బీపీ, షుగర్ ఇవే కనపడుతున్నాయి. ఎక్కువ మంది, డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే, లైఫ్ అంతా కూడా ఎంతో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. రకరకాల అనారోగ్య సమస్యలకి కూడా, దారి తీయవచ్చు. కాబట్టి, డయాబెటిస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ ఉండడంతో అందరూ కంగారు పడిపోతున్నారు. ఏమైనా డయాబెటిస్ వచ్చేసిందేమోనని ఆందోళన పడుతున్నారు.
డయాబెటిస్ ముందు ఎలాంటి లక్షణాలు కనబడతాయి..?, ఎలా డయాబెటిస్ ని గుర్తించొచ్చువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ రావడానికి ముందు, కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. డయాబెటిస్ వచ్చిందని చాలామంది, టెస్ట్ చేయించుకోకుండా ఉంటారు. డయాబెటిస్ వచ్చినట్లు కూడా తెలియదు. అయితే, డయాబెటిస్ ఉన్నట్లయితే, యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రాత్రిపూట యూరిన్ వెళ్లడం, అలానే బాగా దాహం వేయడం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ మంచినీళ్లు తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా డయాబెటిస్ లక్షణాలు అని మనం తెలుసుకోవచ్చు. సడన్ గా బరువు తగ్గడం, తిమ్మిర్లు, కళ్ళు మసకబారడం లక్షణాలు ఉంటే షుగర్ ఉండచ్చు. తినక ముందు షుగర్ టెస్ట్ చేయించుకోవడం, తిన్నాక షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఇలా సరిగా టెస్ట్ చేయించుకుని ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
లేదంటే మంచి డాక్టర్ చేయడం మంచిది. చాలామంది, ఇలా షుగర్ టెస్ట్ చేయించుకోకుండా నార్మల్ గా చేయించుకుంటారు. కానీ, అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా నెగ్లెట్ చేయకూడదు టెస్ట్ సరిగ్గా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి, షుగర్ ఉందేమో అని అనుమానం వున్నా, ఇటువంటి లక్షణాలు వున్నా కచ్చితంగా ఈ విధంగా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మందులు తీసుకుని, డయాబెటిస్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.