వైద్య విజ్ఞానం

ఈ అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? అయితే మీకున్నది ఏ వ్యాధో తెలుసుకోండి..!

మ‌న‌కు ఏదైనా అనారోగ్యం క‌లిగిందంటే చాలు… మ‌న‌కు ముందుగా కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవే ల‌క్షణాలు చాలా అత్య‌ల్పంగా ఉంటే ప‌ట్టించుకోం, కానీ అవి కొన్ని రోజుల త‌ర‌బ‌డి ఉంటే మాత్రం క‌చ్చితంగా వైద్యుడి వ‌ద్ద‌కు వెళ‌తాం. చికిత్స తీసుకుంటాం. మ‌రి… చికిత్స తీసుకున్నాక కూడా అవే అనారోగ్య ల‌క్ష‌ణాలు మ‌ళ్లీ మళ్లీ అలాగే వ‌స్తుంటే..? అప్పుడు మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు. ఎందుకంటే అలా ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుని అది త‌క్కువ‌య్యాక కూడా మ‌ళ్లీ అలాగే ఆ అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే మాత్రం అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. ఈ క్రమంలో ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో లేదంటే ఎలాంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి లోప‌లి గుడ్డు పై పొర‌ను స్క్లెరా అంటారు. దీనిపై రంగు మారుతుంటే అప్పుడు మీరు జాండిస్ లేదంటే లివ‌ర్ వ్యాధులు, హై బీపీతో బాధ ప‌డుతున్న‌ట్టు అర్థం చేసుకోవాలి. త‌ర‌చూ మూత్రం లేదా మ‌లానికి వెళ్లినా, అస‌లు వెళ్ల‌క‌పోయినా వారు ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్న‌ట్టు లెక్క‌. లేదంటే అది జీర్ణాశ‌యం, మూత్రాశ‌యానికి చెందిన ఏదైనా స‌మ‌స్య అయి కూడా ఉండ‌వ‌చ్చు. పిరుదులు ఎల్ల‌ప్పుడూ దుర‌ద‌గా ఉంటే వారికి పైల్స్‌, హెమ‌రాయిడ్స్ వ‌స్తాయ‌ని అర్థం. అలాంటి వారు క‌చ్చితంగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకుంటే వ్యాధి బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. చ‌ర్మంపై మ‌చ్చ‌లు ఎక్కువ‌గా ప‌డుతూ క్ర‌మేపీ అవి పెద్ద‌గా అవుతుంటే అది క్యాన్స‌ర్ అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. లేదంటే వారికి ఎండ‌లో తిరగ‌డం వ‌ల్ల కూడా అలా మ‌చ్చ‌లు ప‌డుతూ ఉండ‌వ‌చ్చు. వైద్యున్ని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకుంటే మంచిది.

if you have these symptoms know what they mean

ద‌గ్గు తీవ్రంగా వ‌స్తూ అస‌లు త‌గ్గ‌కుండా ఉంటే వారికి లంగ్ క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవాలి. డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి త‌గిన చికిత్స ముందుగానే తీసుకోవాలి. లేదంటే అది గొంతు క్యాన్స‌ర్ అయి కూడా ఉండ‌వ‌చ్చు. 30 సంవ‌త్స‌రాలు రాక ముందే త‌ల వెంట్రుక‌లు 50 శాతానికి పైగా తెల్ల‌బ‌డిపోతే అప్పుడు వారికి డ‌యాబెటిస్ ఉన్న‌ట్టు లెక్క‌. డాక్ట‌ర్ ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిది. త‌ర‌చూ కోపం బాగా వ‌స్తుంటే వారు డిప్రెష‌న్‌తో బాధ ప‌డుతున్న‌ట్టు లెక్క‌. అలాంటి వారు సైకియాట్రిస్టును క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవాలి. నోటిలో త‌ర‌చూ పుండ్లు ప‌డడం, నాలుక ప‌గిలిన‌ట్టు అవుతుంటే వారికి నోటి స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు అర్థం చేసుకోవాలి. అలాంటి వారికి కొన్ని సార్లు జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ఉన్నా నాలుక అలాగే ప‌గులుతుంది. గోర్లు వాటిక‌వే చిట్లిపోవ‌డం, పగిలిపోవ‌డం అవుతూ ఉంటే వారికి హెచ్ఐవీ ఉన్న‌ట్టు తెలుసుకోవాలి. లివ‌ర్ వ్యాధుల కార‌ణంగా కూడా గోర్లు అలా ప‌గులుతాయి.

Admin

Recent Posts