వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయిన‌ట్లే..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యంత్రం ఏంటో తెలుసా..? మన బాడీ.. ఏదో సినిమలోని డైలాగ్ అయినప్పటికీ అది నిజంగా నిజం. ఏ మెషిన్ కూడా మన బాడీ కంటే ఖరీదైనది కాదు. అలాగే ఏ మెషిన్ కయినా వాటి భాగాలు పోతే మళ్ళీ కొత్త భాగాలు తెచ్చుకోవచ్చు. కానీ మన శరీరానికి అలా కాదు. అందుకే ప్రతీ భాగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మన శరీరానికి కావాల్సిన ఇంధనం సరిగ్గా అందుతుందా లేదా చెక్ చేసుకోవడమే. రేడియేటర్లో నీళ్ళు తగ్గుతున్నాయా, పెట్రోల్ ట్యాంకుల్లో చెత్త ఇరుక్కుందా మొదలగు వాటిని ఎప్పటికప్పుడు ఎలాగైతే చెక్ చేసుకుంటామో, అలాగే శ‌రీరాన్ని కూడా కండిష‌న్‌లో ఉంచుకోవాలి. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ఐతే మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగమైన కిడ్నీల గురించి తెలుసుకుందాం. కిడ్నీ సమస్యలున్నాయేమో అని బాధపడేవారు కిడ్నీ వ్యాధి లక్షణాలు తెలుసుకోండి. ఈ కింద కనిపిస్తున్న లక్షణాలు మీలో ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో మలినాలు సరిగ్గా బయటకి పోవు. దాని కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఎక్కువగా ఆకలి వేయదు. శరీరంలో మలినాలు లోపలే ఉండిపోతాయి కాబట్టి ఈ సమస్య అధికం అవుతుంది. ఊపిరితిత్తుల్లో కఫం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాళ్ళు, చేతులు, ముఖం తరచుగా వాస్తున్నాయంటే కిడ్నీలో లోపం అని గుర్తించవచ్చు. ఇలా తరచుగా జరుగుతుంటే డాక్టరుని సంప్రదించడం ఉత్తమం.

if you have these symptoms then your kidneys might have failed

వెన్ను భాగంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలు ఫెయిలైతే వచ్చే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. శరీరంలో మలినాలు ఉండిపోవడం వల్ల తొందరగా అలసిపోతారు. ఎక్కువ అలసటకి గురై ఇబ్బందులు ఎదురవుతాయి. తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళడం, లేదా మూత్రంలో రక్తం పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కిడ్నీ సమస్యలు త‌గ్గాలంటే డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డంతోపాటు ఆహారం విష‌యంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts