Sleeping Mouth Open : రోజూ రాత్రి నోరు తెరిచి నిద్రిస్తున్నారా.. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Sleeping Mouth Open : నిద్రించేట‌ప్పుడు స‌హజంగానే చాలా మంది అనేక ర‌కాల భంగిమ‌ల్లో నిద్రిస్తుంటారు. ఇక కొంద‌రు గుర‌క కూడా పెడుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం నోరు తెరిచి నిద్రిస్తుంటారు. ఇలా కొంద‌రు చేస్తుంటారు. అయితే దీని వెనుక కార‌ణాలు ఏమిటి.. ఇలా ఎందుకు చేస్తారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నోరు తెరిచి నిద్రించ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో స్లీప్ అప్నియా అంటారు. ఇది అందికీ రాదు. కొంద‌రికి వ‌స్తుంటుంది. ఇందుకు గ‌ల కార‌ణాలు ఏమిటంటే..

సాధార‌ణంగా కొంద‌రికి నిద్రించేట‌ప్పుడు ముక్కులో ర‌క్త‌నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. వాటిల్లో రక్తం వ‌చ్చి చేరుతుంది. దీంతో వాపు వ‌చ్చి అక్క‌డ గాలి స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గాలి పీల్చ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. దీంతో ఆ ఇబ్బంది నుంచి బ‌య‌ట ప‌డేందుకు నోటి ద్వారా గాలి పీలుస్తుంటారు. అందుక‌నే ఆ స‌మ‌యంలో నోరు తెరుస్తారు. ఇదీ.. ఈ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇక దీంతోపాటు ప‌లు ఇత‌ర అంశాలు కూడా ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు కార‌ణాలుగా ఉన్నాయి. అవేమిటంటే..

Sleeping Mouth Open what are the causes must know the facts
Sleeping Mouth Open

ఒత్తిడి అధికంగా ఉన్న‌వారు, త‌ర‌చూ ఆందోళ‌న‌, కంగారు ప‌డేవారు, డిప్రెష‌న్ బారిన ప‌డిన వారు, అల‌ర్జీల స‌మ‌స్య ఉన్న‌వారు, ఆస్త‌మా, ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా నోరు తెరిచి నిద్రిస్తారు. అయితే వైర‌స్ వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు కార‌ణ‌మైతే అప్పుడు నోటి ద్వారా గాలి పీల్చ‌డం వ‌ల్ల వైర‌స్‌లు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో స‌మ‌స్య త‌గ్గుతుంది. అప్పుడు నోరు తెరిచి నిద్రించ‌రు. కానీ త‌ర‌చూ ఇలా కాకుండా రోజూ నోరు తెరిచే నిద్రిస్తుంటే మాత్రం క‌చ్చితంగా అనుమానించాల్సిందే. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి. ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స కూడా తీసుకోవాలి. దీంతో ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. ముందుగానే జాగ్ర‌త్త ప‌డిన వార‌మ‌వుతాం.

Share
Editor

Recent Posts