వైద్య విజ్ఞానం

చిన్నారుల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం&period; ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు&period; నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి&period; అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి&period; వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి&period; పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు&period; కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి&period; అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం&comma; గుండె నిర్మాణం సరిగా లేకపోవడం వంటివి జరుగుతాయి&period; అలాంటి పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు&period; బరువు పెరగరు&period; తీవ్రమైన అలసట బారిన పడతారు&period; కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే పుట్టబోయే పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయి&period; వీటిని అడ్డుకోవడం చాలా కష్టం&period; కానీ పిల్లలు పుట్టిన తర్వాత గుండె జబ్బులు బారిన పడకుండా అడ్డుకోవాలంటే తల్లిదండ్రులు వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ అధికంగా దొరుకుతుంది&period; పిల్లలు కూడా ఆ జంక్ ఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు&period; అలా జంక్ ఫుడ్ తిని ఊబకాయం బారిన పడుతున్న పిల్లలు అధికంగానే ఉన్నారు&period; ఊబకాయం వల్ల గుండెపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది&period; అలాగే అధిక రక్తపోటు&comma; కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా వస్తాయి&period; ఇవన్నీ కూడా చివరికి గుండె జబ్బులకు కారణం అవుతాయి&period; కాబట్టి మీ పిల్లలు ఊబకాయం బారిన పడకుండా కాపాడుకోండి&period; జంక్ ఫుడ్ ను తగ్గించి వారు ఎత్తుకు తగ్గ బరువే ఉండేలా చూసుకోండి&period; కొన్ని రకాల వైరస్‌లు గుండె కండరాలను ఎంతో ప్రభావితం చేస్తాయి&period; దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది&period; ఆ వైరస్ à°² బారిన పడకుండా పిల్లలను సురక్షితమైన ప్రాంతాలలో ఉంచాలి&period; ఇంటిని పరిశుభ్రంగా ఉంచి పిల్లల్ని పెంచడం ముఖ్యం&period; ధూమపానం చేసే చోట పిల్లలును ఉంచడం మంచి పద్ధతి కాదు&period; ఆ పొగను వారు తమకు తెలియకుండానే పీల్చేస్తారు&period; ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది&period; చిన్నపిల్లల ఊపిరితిత్తులు పొగ ప్రభావాలను ఏమాత్రం తట్టుకోలేవు&period; అలాగే గుండె కూడా ఆ పొగను తట్టుకోలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90980 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kids&period;jpg" alt&equals;"these are the reasons for heart problems in kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భధారణ సమయంలో తల్లి అధిక రక్తపోటు&comma; డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతుంటే ఆ ప్రభావం గర్భస్థ శిశువుపై పడే అవకాశం ఉంటుంది&period; ప్రసవం అయ్యాక బిడ్డల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని పెంచేస్తుంది&period; పిల్లల గుండెను కాపాడుకోవడం కోసం ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించండి&period; అలాగే వారికి మంచి ఆహారాన్ని ఇవ్వండి&period; ప్రతిరోజు నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయించేందుకు ప్రయత్నించండి&period; వారు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నా&comma; తీవ్రంగా అలసిపోతున్న వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించండి&period; పిల్లలను కలుషిత వాతావరణంలోను&comma; సిగరెట్ పొగలకు దూరంగా ఉంచడం చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts