కిడ్నీ స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వరకు తెలియడం లేదు. కానీ అవి చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సులభంగా కరిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మన శరీరం మనకు కొన్ని లక్షణాలను, సూచనలను చూపిస్తుంది. వాటిని కనిపెట్టడం ద్వారా మనకు కిడ్నీ స్టోన్లు ఉన్నాయని గుర్తించవచ్చు. ఈ క్రమంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మారకుండా చూసుకోవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు ఉంటే మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
* కిడ్నీ స్టోన్లు ఉంటే పొట్ట కింది భాగంలో.. అంటే బొడ్డుకు రెండు వైపులా చిన్నగా నొప్పి వస్తుంది. కానీ దీన్ని గ్యాస్ అనుకుని పొరపాటు పడుతుంటారు. కిడ్నీ స్టోన్లు చిన్నగా ఉన్నప్పుడే ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి వెనుక వైపు కూడా అదే రెండు వైపులా వస్తుంది. కనుక ఆ భాగాల్లో నొప్పి వస్తుందంటే అనుమానించాల్సిందే. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. స్టోన్స్ ఉన్నట్లు తేలితే వెంటనే మందులను వాడాలి. దీంతో అవి పెద్ద సైజుకు మారకుండా చూసుకోవచ్చు.
* కిడ్నీ స్టోన్స్ ఉంటే మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంది. మూత్రం ఘాటైన వాసన వస్తుంది.
* ఉదయాన్నే నిద్ర లేచాక మూత్రాన్ని ఒక గాజు గ్లాస్‌లో పట్టి 1 గంట సేపు కదలకుండా అలాగే ఉంచాలి. తరువాత మూత్రాన్ని పరీక్షించాలి. అందులో నల్లని రేణువులు, మడ్డి ఉంటే.. కిడ్నీ స్టోన్లు ఉన్నట్లు లెక్క. లేకపోతే మూత్రం క్లియర్‌గా ఉంటుంది.
* కిడ్నీ స్టోన్లు ఏర్పడితే నడుం నుంచి కింది భాగంలో కొన్ని చోట్ల వాపులు వస్తాయి. ఆ వాపులను గమనిస్తుండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఉన్నాయో, లేదో పరీక్షలు చేయించుకోవచ్చు.
* డయాబెటిస్ ఉన్నవారే కాదు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారు కూడా తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. మూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది.
* కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి తరచూ జ్వరం వస్తుంటుంది. ఒక్కోసారి వికారం, అలసట, వణుకు కూడా వస్తాయి.
* కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి నొప్పి ఏమీ లేకపోయినా ఒక్కోసారి మూత్రంలో రక్తం పడుతుంది. ఇది ఎరుపు లేదా డార్క్ పసుపు రంగులో ఉంటుంది.
* కుటుంబంలో లేదా రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
* మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నాయంటే కిడ్నీ స్టోన్లు ఉన్నాయేమోనని అనుమానించాలి. అలాగే ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటుండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు వస్తే వెంటనే తెలిసిపోతుంది. ఫలితంగా చికిత్స తీసుకుని అవి పెద్ద సైజుకు మారకుండా జాగ్రత్త పడవచ్చు.