Thyroid Symptoms : మనల్ని వేధించే దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ వ్యాధి బారిన పడినట్టు చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. దీంతో సమస్య మరీ తీవ్రతరమై అధిక డోస్ మందులను వాడాల్సి వస్తుంది. ఇలా ఆలస్యంగా గుర్తించడం వల్ల జరగాల్సిన నష్టం అంతా అప్పటికే జరిగిపోతుంది. ఈ థైరాయిడ్ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చు. ఆకలి లేకపోవడం, బరువులో చాలా వ్యత్యాసం రావడం వంటి వాటిని మనం చాలా చిన్న సమస్యలుగా భావిస్తాం. కానీ ఇవే మన శరీరంలో జరిగే అనారోగ్యాలకు బలమైన కారణాలు కావచ్చు. మనం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే శరీర బరువు తగ్గడం లేదా బరువు పెరగడం జరగవచ్చు.
ఈ సమస్యలతో బాధపడితే కనుక మనం థైరాయిడ్ బారిన పడినట్టేనన్ని అర్థం చేసుకోవాలి. హైపర్ థైరాయిడిజం కలిగి ఉన్న వారిలో జీవక్రియల రేటు పెరగడం వల్ల బరువు తగ్గుతారు. ఆకలి లేకపోవడం కూడా థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి. థైరాయిడ్ బారిన పడిన వారు ఆహారాన్ని తీసుకోవడానికి విముఖత చూపిస్తారు. అలాగే మలబద్దకం, విరోచనాలు వంటి జీర్ణసంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ ఉంటే కూడా థైరాయిడ్ ఉన్నట్టు అర్థం. గ్యాస్, కడుపు ఉబ్బరం, అపాన వాయువు వంటి సమస్యలు కూడా థైరాయిడ్ వల్ల కలుగుతాయి. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలో వ్యత్యాసం రావడం వల్ల అది జీర్ణాశయ వ్యవస్థపై ప్రభావితం చూపిస్తాయి.
దీంతో ఈ విధమైన జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే సోయా చంక్స్, సోయా ఉత్పత్తులు, క్యాబేజ్ వంటి ఆహారాలను తీసుకున్నప్పుడు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం వంటి జరుగుతూ ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంథి విధులను ప్రభావితం చేస్తాయి. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం కూడా థైరాయిడ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇలా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తగానే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలాగే మనం ఉత్తేజనానికి గురి కాకుండానే గుండె వేగంగా కొట్టుకుంది. ఇది కూడా థైరాయిడ్ లక్షణాలలో ఒకటి. థైరాయిడ్ యొక్క తక్కువ స్థాయిల వల్ల సాధారణ సమయంలో ఉండే హృదయ స్పందనల రేటు తగ్గుతుంది.
అదే విధంగా థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరగడాన్ని గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్రంథి సమస్యలు అధికం అవ్వడం వల్ల గ్రంథి పెరగడం, గడ్డలుగా మారడం లేదా గొంతు ప్రాంతంలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితి హైపర్ మరియు హైపో థైరాయిడిజం రెండింటిలోనూ కలుగుతుంది. మెడ భాగంలో గడ్డలు ఏర్పడడం లేదా వాపులను గమనించినట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.