Tingling : సాధారణంగా మనం చాలా సేపు ఒకే భంగిమలో చేతులు లేదా కాళ్లను కదిలించకుండా అలాగే కూర్చుని లేదా నిలుచుని ఉన్నా.. వేరే ఏదైనా భంగిమలో కదలకుండా ఉన్నా.. మన చేతులు.. కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. ఆ ప్రాంతంలో స్పర్శ లేనట్లు అనిపిస్తుంది. ఇది సహజమే. కొంత సేపటి తరువాత మళ్లీ ఆయా అవయవాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే కొందరికి మాత్రం ఈ సమస్య తరచూ వస్తుంటుంది. తిమ్మిర్లు ఒక పట్టాన తగ్గవు. అయితే దీనికి పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే..
శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నా ఇలాగే తిమ్మిర్లు వస్తుంటాయి. ఇదే సమస్య అయితే మనకు విటమిన్ బి12 తగినంత లభిస్తే చాలు. లేదా డాక్టర్‌ను సంప్రదించి ఈ ట్యాబ్లెట్లను కూడా వాడుకోవచ్చు. దీంతోపాటు విటమిన్ బి12 అధికంగా ఉండే.. రొయ్యలు, చేపలు, మటన్ లివర్, పుట్ట గొడుగులు, చీజ్, ఓట్స వంటి ఆహారాలను తీసుకున్నా.. ఈ లోపం నుంచి బయట పడవచ్చు. దీంతో తిమ్మిర్లు అవే తగ్గిపోతాయి.
ఇక డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇలాగే తిమ్మిర్లు వస్తుంటాయి. కనుక షుగర్ సమస్య ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. అదే సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. దీంతో తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.
ఇక ఇవే కాకుండా నరాల సమస్యలు, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, అధిక బరువు, కండరాలపై అధికంగా ఒత్తిడి పడడం, కాల్షియం లోపం, గర్భిణీలకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తుంటాయి. కనుక సమస్య ఎక్కడ ఉన్నది తెలియాలంటే వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో సమస్య ఏమిటి.. అనేది తెలుస్తుంది. ఫలితంగా ఆ సమస్యకు చికిత్స తీసుకుంటే చాలు.. దీంతో ఆ సమస్య తగ్గుతుంది. అలాగే తిమ్మిర్లు కూడా పోతాయి. ఇలా తిమ్మిర్ల సమస్య నుంచి బయట పడవచ్చు.