వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఎన్ని ర‌కాలు.. దాని ల‌క్ష‌ణాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు&period; డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి&comma; ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం&comma; రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత&period; అతిమూత్రం&comma; దాహం ఎక్కువగా వేయడం &comma; మందగించిన చూపు&comma; కారణం లేకుండా బరువు తగ్గడం&comma; బద్ధకం దీని ముఖ్య లక్షణాలు&period; మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం&comma; చైనా&comma; అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి వుంది&period; ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు&period; జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం&period; లేదంటే జీవన విధానం మార్చుకొని వ్యాధిని తగ్గించుకోవచ్చు&period;ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు&colon; వివిధ రకాల కారణాల వల్ల పుటుకతోనే కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1 కాగా రెండవది టైప్ 2 రకం&comma; జెస్టేషనల్ డయాబెటిస్ &lpar;గర్భిణీలలో వచ్చే డయాబెటిస్&rpar;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89090 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-9&period;jpg" alt&equals;"types in diabetes and its symptoms " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే&period; మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం అంటే దీనినే ఆటోఇమ్యూనిటీ గా పేర్కొంటారు&period; రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది&period; దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది&comma; బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది&period; జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత కనపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts