వైద్య విజ్ఞానం

పల్స్ (pulse) రేట్ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు? ఏది ఆరోగ్య వంత మైన పల్స్ రేట్?

<p style&equals;"text-align&colon; justify&semi;">పల్స్ రేట్ అంటే నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో దాన్ని సూచిస్తుంది&period; మనం నాడిని తాకినప్పుడు గుండె కొట్టుకునే ప్రతిసారీ ఒక చిన్న తాకిడి అనిపిస్తుంది&period; అదే పల్స్&period; మణికట్టు లోపలి భాగంలో&comma; మోచేయి వంచినప్పుడు ఒక ఎముక&comma; కండరాల మధ్య నాడిని సులభంగా గుర్తించవచ్చు&period; ఒక నిమిషం పాటు నాడిని తాకి&comma; గుండె కొట్టుకున్న సంఖ్యను లెక్కించాలి&period; లెక్కించిన సంఖ్యే మీ పల్స్ రేట్&period; లేదా… 30 సెకన్ల పాటు లెక్కించి&comma; ఆ సంఖ్యను రెట్టింపు చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పల్స్ రేట్ వయస్సు&comma; లింగం&comma; ఆరోగ్య స్థితి&comma; శారీరక శ్రమ&comma; ఇతర కారకాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది&period; ఆరోగ్యకరమైన పల్స్ రేటు నిమిషానికి 60 నుండి 100 కొట్టుకునే వరకు ఉంటుంది&period; పిల్లలలో పల్స్ రేటు పెద్దల కంటే ఎక్కువగా ఉంటుంది&period; తరచుగా శారీరక శ్రమ చేసే వారిలో పల్స్ రేటు తక్కువగా ఉండవచ్చు&period; గుండె జబ్బులు ఉన్నవారిలో పల్స్ రేటు ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83956 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pulse-rate&period;jpg" alt&equals;"what is pulse rate and how it is calculated " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పల్స్ రేటు ఎల్లప్పుడూ ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే&comma; శారీరక శ్రమ లేకుండా కూడా మీ హృదయం బలంగా కొట్టుకుంటుంటే&comma; మీకు తరచూ తల తిరుగుతున్నట్లు లేదా గుండె కొట్టుకునే శబ్దం వినిపిస్తే&comma; మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts