mythology

భీష్ముడు ఎవ‌రి వ‌ద్ద విద్య‌ల‌ను నేర్చుకున్నాడు, ఆయ‌న గురువులు ఎవ‌రు..?

భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం. భీష్ముడు ఎవరు, ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసుకుందాం…

భీష్ముడు గంగా, శంతనుల‌ అష్టమ పుత్రుడు. ఆయన దృఢవ్ర‌త‌ శీలుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు. భీష్ముడు భూతభవిష్యద్వర్తమానవేది. సర్వవిద్యలకు ఆధారభూతుడు. ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించిన మహా బుద్ధిశాలి. ఒకానొక సందర్భంలో గురువు దోషదూషితుడైనప్పుడు ఆ దోషాన్ని గుర్తుకు తెచ్చి అతనికి కనువిప్పు కలిగిండచం శిష్యుని ధర్మం.

do you know who are bheeshmas teachers

శిఖండిని ఉద్దరించడానికి పోటీపడిని తన గురువైన పరుశరామునికి ధర్మతత్తాన్ని వివరించి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. భీష్ముడి వల్ల పరుశరామునికి కీర్తి కలిగింది. ఇప్పుడు అర్థమయ్యిందా.. భీష్ముడు గురువులు ఎవరెవరు అనేది… చ్యవనుడు, మార్కండేయుడు, పరుశరాముడు. అదండి సంగతి. కురువృద్ధ పితామహుడు.. మహాబలశాలి, ఆ జన్మ బ్రహ్మచారి, ధర్మోపదేశ విజ్ఞాని భీష్మ పితామహుడు.

Admin

Recent Posts