Agra Petha : ఆగ్రాలో ల‌భించే ఫేమ‌స్ పేఠా స్వీట్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Agra Petha : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో తినేందుకు అనేక ర‌కాల స్వీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని స్వీట్లు మాత్రం కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమ‌స్. ఫ‌లానా స్వీట్‌ను అక్క‌డే తినాల‌ని చాలా మంది చెబుతుంటారు. అలాంటి కొన్ని స్వీట్ల‌లో ఆగ్రాకు చెందిన పేఠా కూడా ఒక‌టి. ఇది ఆగ్రాలో చాలా ఫేమ‌స్‌. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని బూడిద గుమ్మ‌డికాయ‌ల‌తో త‌యారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే కాస్త శ్ర‌మిస్తే ఈ స్వీట్‌ను మనం కూడా ఎంతో రుచిగా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆగ్రా పేఠాను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగ్రా పేఠా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బూడిద గుమ్మ‌డికాయ – 1 (చిన్న‌ది, 1 కిలో బ‌రువు ఉండాలి), చ‌క్కెర – 4 క‌ప్పులు, నీళ్లు – 2 క‌ప్పులు, ఆలం – పావు టీస్పూన్‌, రోజ్ వాట‌ర్ – కొన్ని చుక్క‌లు, గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్ – త‌గినంత‌, సిల్వ‌ర్ ఫాయిల్ – గార్నిష్ కోసం.

Agra Petha recipe in telugu make in this method
Agra Petha

ఆగ్రా పేఠాను త‌యారు చేసే విధానం..

ముందుగా గుమ్మ‌డికాయ‌ను శుభ్రంగా క‌డ‌గాలి. మీద ఉండే తొక్క తీయాలి. లోప‌ల ఉండే విత్త‌నాల‌ను తీసేసి గుజ్జును సేక‌రించాలి. గుమ్మ‌డి కాయ గుజ్జును డైమండ్ షేప్ వ‌చ్చేలా అర ఇంచు మందంతో చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఒక పెద్ద కుండ లేదా అలాంటి పాత్ర‌లో నీళ్లు పోసి మ‌రిగించాలి. గుమ్మ‌డికాయ ముక్క‌ల‌ను ఆ నీళ్ల‌లో వేసి ఉడికించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ముక్క‌లు మెత్త‌గా మృదువుగా మారుతాయి. అయితే మ‌రీ అతిగా ఉడికించ‌రాదు. కాస్త ఉడికిస్తే చాలు.

త‌రువాత ఉడికిన ముక్క‌ల లోంచి నీటిని వంపేయాలి. ముక్కల‌ను చ‌ల్ల‌బ‌డే వ‌ర‌కు కాసేపు అలా ప‌క్క‌న పెట్టాలి. ఇంకో పాత్ర‌లో నీళ్లు, చ‌క్కెర పోసి క‌ల‌పాలి. సిమ్‌లో స్ట‌వ్‌ను ఉంచి చ‌క్కెర పూర్తిగా క‌రిగి సిర‌ప్‌లా మారే వ‌ర‌కు మ‌రిగించాలి. ఆలం ఉప‌యోగించిన‌ట్ల‌యితే ఆ పాకంలో వేసి క‌ల‌పాలి. అనంత‌రం ఉడికిన గుమ్మ‌డికాయ ముక్క‌ల‌ను ఆ పాకంలో వేయాలి. త‌రువాత స‌న్న‌ని మంట‌పై స్ట‌వ్‌ను ఉంచి 30 నుంచి 40 నిమిషాల పాటు మ‌ళ్లీ ఉడికించాలి. దీంతో ముక్క‌లు పాకంను పీల్చుకుంటాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో ముక్క‌ల‌ను క‌లుపుతూ ఉండాలి. అందులోనే రోజ్ వాట‌ర్‌ను వేయాలి. కొన్ని చుక్క‌ల గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్‌ను కూడా వేయాలి.

గుమ్మ‌డికాయ ముక్క‌లు పార‌ద‌ర్శ‌కంగా మారుతాయి. పాకం చిక్క‌బ‌డుతుంది. దీంతో స్ట‌వ్‌ను ఆఫ్ చేసి స్వీట్‌ను చ‌ల్ల‌బ‌ర‌చాలి. త‌రువాత ముక్క‌ల‌ను ఒక ట్రేలో వేసి 8 నుంచి 10 గంట‌ల పాటు డ్రై అయ్యే వ‌ర‌కు అలాగే ఉంచాలి. లేదా రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో ముక్క‌లు పూర్తిగా పొడిగా మారుతాయి. అప్పుడు వాటిని సిల్వ‌ర్ ఫాయిల్‌లో చుట్టి గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన ఆగ్రా పేఠా రెడీ అవుతుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటెయిన‌ర్‌లో స్టోర్ చేస్తే కొన్ని వారాల పాటు అలాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్వీట్‌ను తిని ఆస్వాదించ‌వచ్చు. ఇలా ఆగ్రా పేఠాను ఎంతో సుల‌భంగా ఇంట్లోనే చేయ‌వ‌చ్చు. అంద‌రూ ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు.

Editor

Recent Posts