వినోదం

Sneha Reddy : అల్లు అర్జున్ కు ఇష్ట‌మైన ఫుడ్ ఏది ? స‌మాధానం చెప్పేసిన స్నేహా రెడ్డి..!

Sneha Reddy : సోష‌ల్ మీడియాలో ఏ హీరో భార్య‌కు లేని ఫాలోవ‌ర్లు.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఉన్నారు. ఆమె హీరోయిన్ల‌కు స‌మానంగా సెల‌బ్రిటీగా కొన‌సాగుతున్నారు. త‌న గురించి, త‌న ఫ్యామిలీ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె సోష‌ల్ ఖాతాల్లో అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు వెకేష‌న్‌కు వెళ్లినా అక్క‌డ తీసుకున్న ఫొటోలు, వీడియోల‌ను ఆమె షేర్ చేస్తుంటారు. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫాలోవ‌ర్ల‌తో కాసేపు ముచ్చ‌టించారు. లైవ్‌లోకి వ‌చ్చిన ఆమె త‌న అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఇక వాటిల్లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అదేమిటంటే..

అల్లు అర్జున్ కు ఇష్ట‌మైన ఫుడ్ ఏద‌ని ఒక నెటిజ‌న్ అడ‌గ్గా.. అందుకు స్నేహా రెడ్డి స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న‌కు ఇష్ట‌మైన ఫుడ్ బిర్యానీ అని బ‌దులు చెప్పారు. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. మొద‌టి పార్ట్‌కు విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించ‌డం.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం.. కేజీఎఫ్ 2 విడుద‌ల‌.. వంటి అంశాల వ‌ల్ల పుష్ప 2 పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అందుక‌ని సుకుమార్ స్క్రిప్ట్‌ను చాలా ప‌క‌డ్బందీగా రూపొందించారు. అందుక‌నే షూటింగ్ ఆల‌స్యం అయినా ఎట్టకేల‌కు పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతోంది.

allu arjun favorite food told by allu sneha reddy

ఇక మొద‌టి పార్ట్‌లో న‌టించిన వారంద‌రూ రెండో పార్ట్‌లోనూ న‌టించ‌నున్నారు. ముఖ్యంగా మొద‌టి భాగంలో దాక్షాయ‌ణిగా న‌టించిన అనసూయ‌కు ఎక్కువ సేపు తెర‌పై క‌నిపించే అవ‌కాశం లేకుండా పోయింది. కానీ రెండో పార్ట్‌లో ఆమె పాత్ర నిడివి పూర్తి స్థాయిలో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కు గాను సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ రూపొందించిన పాట‌లు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Admin

Recent Posts