Aloo Kurma : పూరీ, చ‌పాతీ, రైస్‌, దోశ‌.. ఎందులోకి అయినా స‌రే ఆలు కుర్మా ఇలా చేస్తే ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుంది..!

Aloo Kurma : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ కుర్మా కూడా ఒక‌టి. ఆలూ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, పూరీ, అన్నం, బ‌గారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా క్యాట‌రింట్ వాళ్లు దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. క్యాట‌రింగ్ వాళ్లు చేసే ఈ కర్రీ ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ కుర్మాను మ‌నం ఇంట్లో కూడాఅదే రుచితో త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. క్యాట‌రింగ్ స్టైల్ ఆలూ కుర్మాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 5 (చిన్న‌వి), జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, పుచ్చ‌గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉడికించిన ప‌చ్చిబ‌ఠాణీ – అర క‌ప్పు, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు నుండి ముప్పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్.

Aloo Kurma for all types of foods prepare in this way
Aloo Kurma

ఆలూ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా జార్ లొ జీడిప‌ప్పు, పుచ్చ‌గింజ‌లు వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, కారం వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, ప‌చ్చిబ‌ఠాణీ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ధ‌నిచయాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, క‌సూరిమెంతి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా త‌యార‌వుతుంది. ఈ కుర్మాను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts