Aloo Masala Puri : ఆలూ మ‌సాలా పూరీని ఎప్పుడైనా తిన్నారా.. ఈసారి ఇలా ట్రై చేయండి..!

Aloo Masala Puri : అప్పుడ‌ప్పుడూ మ‌నం అల్పాహారంగా పూరీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే పూరీలే కాకుండా మ‌నం బంగాళాదుంప‌ను ఉప‌యోగించి మ‌సాలా పూరీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా మ‌సాలా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మ‌సాలా పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప – 1 ( పెద్ద‌ది), గోధుమ పిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ప‌చ్చిమిర్చి – 1, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, క‌రివేపాకు త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Aloo Masala Puri try different this time recipe
Aloo Masala Puri

ఆలూ మ‌సాలా పూరీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి, మిరియాలు, ఉప్పు, జీల‌క‌ర్ర‌, ఉడికించిన బంగాళాదుంప వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న బంగాళాదుంప మిశ్ర‌మం కూడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌రీ గట్టిగా మ‌రీ మెత్త‌గా కాకుండా పిండిని క‌లుపుకోవాలి. త‌రువాత 2 టీ స్పూన్ల నూనె వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పిండిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని పొడి పిండి వేసుకుంటూ పూరీలా వ‌త్తుకోవాలి. పూరీ మ‌రీ ప‌లుచ‌గా, మ‌రీ మందంగా ఉండ‌కుండ చూసుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసి గంటెతో వ‌త్తుతూ కాల్చుకోవాలి. గంటెతో వ‌త్త‌డం వ‌ల్ల పూరీ పొంగుతుంది. ఈ పూరీని మ‌ధ్య‌స్థ మంట కంటే కొద్దిగా ఎక్కువ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే ఆలూ మ‌సాలా పూరీ త‌యార‌వుతుంది. దీనిని గ్రేవి కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే పూరీల‌కు బ‌దులుగా అప్పుడ‌ప్పుడు ఇలా మ‌సాలా పూరీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన మ‌సాలా పూరీలను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts