Andhra Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఒక్క‌సారి ఈ స్టైల్‌లో చేయండి.. టేస్ట్ చూస్తే విడిచిపెట్ట‌రు..!

Andhra Tomato Pappu : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల పప్పు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌ప్పు కూర‌లల్లో ట‌మాట ప‌ప్పు కూడా ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాట ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రింత రుచిగా ఆంధ్రాస్టైల్ లో ఈ ట‌మాట ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు -ఒక క‌ప్పు, ట‌మాటాలు – పావుకిలో, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు -ఒక‌రెమ్మ‌, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఉప్పు – త‌గినంత‌, కారం- ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె -ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Andhra Tomato Pappu recipe in telugu tastes better with rice
Andhra Tomato Pappu

ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో కందిపప్పు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత దీనిని కుక్క‌ర్ లోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులోనే త‌రిగిన ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి, ప‌సుపు, నీళ్లు, నూనె వేసి మూత పెట్టాలి. ఈ ప‌ప్పును 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, చింత‌పండు పులుసు వేసి క‌ల‌పాలి. ఇప్పుడుక‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి.

త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న ప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట ప‌ప్పును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts