వినోదం

Anji Movie : అంజి సినిమాకు అస‌లు మొత్తం బ‌డ్జెట్ ఎంత‌..? ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి..? ఎందుకు ఫ్లాప్ అయింది..?

Anji Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో అనేక సినిమాలు హిట్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. ఎన్నో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన మూవీలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాంటి వాటిల్లో అంజి ఒక‌టి. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి రూ.25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిరాశ‌ప‌రిచింది.

అంజి మూవీని అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో, ప్ర‌తిష్టాత్మ‌కంగా.. పెద్ద ఎత్తున‌.. అత్యంత నాణ్య‌మైన ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌తో నిర్మించారు. రూ.25 కోట్ల‌తో నిర్మిస్తే సినిమాకు వ‌చ్చింది రూ.5 కోట్లే. దీంతో నిర్మాత‌కు దారుణ‌మైన న‌ష్టం వ‌చ్చింది. అప్ప‌ట్లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బ‌డిన తెలుగు మూవీ ఇదే. దీన్ని ఏకంగా 7 ఏళ్లు తీశారు. సినిమా క్లైమాక్స్‌ను తీసేందుకే 2 ఏళ్లు ప‌ట్టింది. ఎందుకంటే అది పూర్తిగా గ్రాఫిక్స్‌తో తీయాల్సి ఉంటుంది. కానీ వారికి అప్ప‌ట్లో నాణ్య‌మైన గ్రాఫిక్స్‌ను చేసి పెట్టే సంస్థ‌లు ల‌భించ‌లేదు. దీని వ‌ల్ల సినిమా బాగా ఆల‌స్యం అయింది. ఈ క్ర‌మంలోనే ఇందులో న‌టించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా సినిమా పూర్త‌య్యే స‌రికి గుర్తు ప‌ట్ట‌రాకుండా మారిపోయారు.

anji movie budget and total collections

అంజి సినిమా క‌థ‌, గ్రాఫిక్స్ ప‌రంగా బాగానే ఉన్న‌ప్ప‌టికీ సినిమా చాలా ఆల‌స్యం అవడం వ‌ల్లే దీనిపై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పూర్తిగా త‌గ్గిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే క్లైమాక్స్ సైతం పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. ఈ కార‌ణాల వ‌ల్లే సినిమా ఫ్లాప్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీకి గ్రాఫిక్స్ విభాగంలో నేష‌న‌ల్ అవార్డు రాగా.. మ‌రో రెండు నంది అవార్డులు కూడా వ‌చ్చాయి. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మించినా స‌కాలంలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాక‌పోతే ఫ‌లితం ఇలాగే ఉంటుంద‌ని అంజి సినిమా నిరూపించింది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ చిరు కెరీర్ లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts