Anshu : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా వచ్చాక కొందరు ఎక్కువ కాలం పాటు అలాగే హీరోయిన్‌గా ఉంటారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలు పెడతారు. అయితే కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి వెండితెరకు దూరమవుతుంటారు. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో అన్షు ఒకరు. ఈమెను అన్షుగా కన్నా.. మన్మథుడు హీరోయిన్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. తన అందం, అభినయంతో ఈమె అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే కేవలం కొన్ని సినిమాలే చేసింది. తరువాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.
అన్షు పూర్తి పేరు అన్షు అంబానీ.. 1986 ఫిబ్రవరి 3న జన్మించింది. ఈమెది లండన్. నటిగా, ఫ్యాషన్ డిజైనర్ గా ఈమెకు పేరుంది. 2002 నుంచి 2004 మధ్య సినిమాలు చేసింది. తరువాత సచిన్ సాగర్‌ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే ఓ ఫ్యాషన్ స్టోర్‌ను నిర్వహిస్తోంది. సినిమా నటీనటులు ధరించి దుస్తులను ఈమె కొని వాటిని రీడిజైన్ చేసి తన స్టోర్‌లో విక్రయిస్తుంది. ఇలా ఆమె అక్కడ బాగా పాపులర్ అయింది.
ఇక సినిమాల విషయానికి వస్తే అన్షు చేసింది కేవలం 4 సినిమాలే. మన్మథుడులో నాగార్జున పక్కన చేయడంతోపాటు ప్రభాస్ సరసన రాఘవేంద్ర మూవీలోనూ యాక్ట్ చేసింది. అలాగే మిస్సమ్మ మూవీలో గెస్ట్ అప్పియరెన్స్‌లో వచ్చింది. తమిళంలో జై అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇదే ఆమెకు చివరి చిత్రం. కాగా అన్షు మళ్లీ ఇండియాకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని.. ఈమె మళ్లీ మూవీల్లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావల్సి ఉంది.