వినోదం

Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో 21 డిసెంబర్‌ 2011న రిలీజ్‌ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన రాజన్న మూవీలో అన్నీ ముఖ్య పాత్రలో నటించింది. రాజన్న సినిమాలో ఈమె మల్లమ్మ పాత్రలో నటించింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలాగే చరణ్‌ చేసిన రంగస్థలం మూవీలో ఆయనకు చెల్లెలి పాత్రలోనూ ఈమె నటించింది.

Annie Rajanna Movie do you know how she is now

ఇక సినిమాలతోపాటు అన్నీ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అందులో ఈమె షేర్‌ చేస్తోంది. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడులోనూ యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్‌ సిరీస్‌లలోనూ ఈమె సందడి చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నీ చైల్ట్‌ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. అందులో భాగంగానే ఈమె ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి.

Admin

Recent Posts