Bathani Curry : చపాతీ, పూరీ, పుల్కా.. లాంటి వాటిలోకి రుచిగా ఉండే బఠాణి కర్రీ.. త‌యారీ ఇలా..!

Bathani Curry : మ‌నం ఎండు బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చాట్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ బ‌ఠాణీల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎండు బ‌ఠాణీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎండు బ‌ఠాణీల‌తో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌ఠాణీ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండిన‌ బ‌ఠాణీ – ఒక కప్పు, నీళ్లు – ఒక గ్లాస్, వంట‌సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 7, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ట‌మాటాలు – 2, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bathani Curry recipe in telugu make in this way
Bathani Curry

బఠాణీ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బ‌ఠాణీల‌ను తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన త‌రువాత బ‌ఠాణీల‌ను శుభ్రంగా క‌డిగి ఒక కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు, ఉప్పు, వంట‌సోడా వేసి మూత పెట్టాలి. త‌రువాత ఈ బ‌ఠాణీల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్కలు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బడిన త‌రువాత ఉడికించిన బ‌ఠాణీల‌ను నీళ్ల‌తో స‌హా వేసుకోవాలి.

త‌రువాత మ‌రో క‌ప్పు నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ధ‌నియాల పొడి, ప‌సుపు, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌ఠాణీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బఠాణీ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts