Bellam Annam Prasadam : ఎంతో క‌మ్మ‌నైన బెల్లం అన్నం ప్ర‌సాదం.. త‌యారీ ఇలా..!

Bellam Annam Prasadam : బెల్లంతో చేసే తీపి వంట‌కాల్లో బెల్లం అన్నం కూడా ఒక‌టి. దీనినే ప‌ర‌మాన్నం అని కూడా అంటూ ఉంటారు. బెల్లం అన్నం ఎంత రుచిగా ఉంటుందో చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ప్ర‌సాదంగా కూడా దీనిని స‌మ‌ర్పిస్తూ ఉంటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు కూడా ఈ బెల్లం అన్నాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. పాలు విరిగిపోకుండా, రుచిగా, క‌మ్మ‌గా బెల్లం అన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం అన్నం ప్ర‌సాదం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – పావు క‌ప్పు, బియ్యం – ముప్పావు క‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 4 క‌ప్పులు, పాలు – ఒక క‌ప్పు, బెల్లం త‌రుము – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ప‌చ్చ క‌ర్పూరం – చిటికెడు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని.

Bellam Annam Prasadam recipe in telugu very tasty
Bellam Annam Prasadam

బెల్లం అన్నం ప్ర‌సాదం త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో పెస‌ర‌ప‌ప్పు వేసివేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే బియ్యం, శ‌న‌గ‌ప‌ప్పు కూడా వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో నీళ్లు, పాలు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి బియ్యం మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. బియ్యం మెత్త‌గా ఉడికిన త‌రువాత బెల్లం త‌రుము వేసిక‌ల‌పాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. ఈ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి, ప‌చ్చ క‌ర్పూరం వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో స‌హా ఉడికించిన బెల్లం అన్నంలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే బెల్లం అన్నం త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి బ‌లం కూడా క‌లుగుతుంది.

D

Recent Posts