Bellam Paramannam : బెల్లంతో ప‌ర‌మాన్నం త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..

Bellam Paramannam : మ‌నం పండుగ‌ల‌కు ఎక్కువ‌గా ప‌ర‌మాన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ప‌ర‌మానాన్ని పంచ‌దార‌తో పాటు బెల్లంతో కూడా త‌యారు చేస్తారు. బెల్లంతో చేసే ప‌ర‌మానాన్ని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే బెల్లంతో ప‌ర‌మాన్నం చేసేట‌ప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతూ ఉంటాయి. పాలు విరిగిపోకుండా రుచిగా, చ‌క్క‌గా బెల్లంతో ప‌ర‌మానాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ర‌మాన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక టీ గ్లాస్, పాలు – 5 టీ గ్లాసులు, బెల్లం తురుము – 2 టీ గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – అర‌ టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని.

Bellam Paramannam recipe in telugu very sweet know how to cook
Bellam Paramannam

ప‌ర‌మాన్నం త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని గిన్నెలో తీసుకుని శుభ్రంగా క‌డిగి అవి మునిగే వ‌ర‌కు నీళ్లు పోసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత మ‌రో గిన్నెలో పాలు, రెండు టీ గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు మ‌రిగిన త‌రువాత అందులో క‌డిగిన బియ్యాన్ని వేసి కలిపి ఉడికించాలి. ఈ బియ్యాన్ని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అందులో బెల్లం తురుము, యాల‌కుల పొడి వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు కల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన త‌రువాత అందులో జీడిప‌ప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని ముందుగా ఉడికించి పెట్టుకున్న‌ ప‌ర‌మాన్నంలో వేసి క‌ల‌పాలి.

ఈ ప‌ర‌మానాన్ని మ‌రోసారి స్ట‌వ్ మీద ఉంచి ఒక నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌మ్మ‌టి రుచి క‌లిగి ఉండే ప‌ర‌మాన్నం త‌యారవుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా పండుగ‌ల‌కు ఇలా బెల్లంతో ప‌ర‌మాన్నాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల పాటు విర‌గ‌కుండా ప‌ర‌మాన్నం చ‌క్క‌గా ఉంటుంది. పంచ‌దారకు బ‌దులుగా బెల్లంతో ప‌ర‌మానాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts