వినోదం

Bhairava Dweepam : భైర‌వ ద్వీపం సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డ్డారా..!

Bhairava Dweepam : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రాల‌లో భైరవ ద్వీపం ఒక‌టి. ఈ సినిమా ఆనాటి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బాలయ్య కురూపి గెటప్ కోసం ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇక ఆ గెట‌ప్‌లో ఆహారం తీసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌డంతో ప‌ది రోజుల పాటు జ్యూస్ మాత్ర‌మే తాగుతూ ఉన్నార‌ట బాల‌య్య‌. 1993 జూన్ 2న మద్రాసు వాహిని స్టూడియోలో భైరవ ద్వీపం మూవీకి రజనీకాంత్ క్లాప్ కొట్టగా చిరంజీవి స్విచ్ఛాన్ చేశారు. ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో నరుడా ఓ న‌రుడా సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. ఈ సాంగ్ తీయ‌డానికి నెల రోజులు ప‌ట్టింద‌ట‌. ఇక అంబ శాంభవి సాంగ్ కోసం జలపాతంకి కష్టం మీద చేరుకొని పార్వతి గుడి, ప్రతిమ సెట్టింగ్ వేశారు. అక్కడికి బాలయ్య, కె ఆర్ విజయలను కష్టం మీద చేర్చ‌గా 80 ఏళ్ల మిక్కిలినేనిని న‌లుగురితో అక్క‌డికి చేర్చేవార‌ట‌. మరుగుజ్జు కోసం నాలుగు లిల్లీపుట్ బొమ్మలు చేసి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ షూట్ చేసారు. ఇక శ్రీ నారద తుంబుర సాంగ్ కోసం బాలయ్య ఎంతో సాధన చేశారు. 235 రోజులు శ్రమించి రూ.4 కోట్ల 35 లక్షలతో ఈ సినిమా చేశారు.

bhairawa dweepam movie interesting facts bhairawa dweepam movie interesting facts

ఈ సినిమా విడుద‌లైన తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. 59 కేంద్రాల్లో 50 రోజులు, చిన్న కేంద్రాలతో సహా 49 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ ప్ర‌తిభ వ‌ల‌న ఈ సినిమా అంత సూప‌ర్ హిట్ అయింది. ఇక న‌రుడా ఓ నరుడా సాంగ్ కి జానకికి, శ్రీ తుంబుర సాంగ్ కి బాలుకి నంది అవార్డులు వచ్చాయి. దర్శకుడితో సహా మరో మూడు నంది అవార్డులు వచ్చాయి. త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

Admin

Recent Posts