Bread Balls Sweet : ఈ స్పెషల్ స్వీట్ ని ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టండి.. అందరూ ఇష్టంగా తింటారు..

Bread Balls Sweet : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో బ్రెడ్ బాల్స్ కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇష్టంగా తినేలా బ్రెడ్ తో స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ బాల్స్ స్వీట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 6, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, కాచి చ‌ల్లార్చిన పాలు – త‌గిన‌న్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, స‌న్నసేమియా – అర క‌ప్పు, చిక్క‌టి పాలు – అర లీట‌ర్, నీళ్లు – అర గ్లాస్, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – 4 టేబుల్ స్పూన్స్ లేదా త‌గినంత‌, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Bread Balls Sweet recipe in telugu make in this method
Bread Balls Sweet

బ్రెడ్ బాల్స్ స్వీట్ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను ముక్క‌లుగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గిన‌న్ని పాలు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక బ్రెడ్ బాల్స్ ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో సేమియా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పాలు, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ పాల‌ను రెండు నుండి మూడు పొంగులు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించిన త‌రువాత అందులో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ ను నీటిలో క‌లిపి వేసుకోవాలి.

ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి క‌లుపుతూ 2 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత సేమియా వేసి క‌ల‌పాలి. త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కీర్ గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత బ్రెడ్ బాల్స్ వేసి క‌ల‌పాలి. బ్రెడ్ బాల్స్ కీర్ లో నానిన త‌రువాత పైన డ్రై ఫ్రూట్స్ చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవ‌చ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లారిన త‌రువాత కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిక‌ర‌మైన బ్రెడ్ బాల్స్ స్వీట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts