Sleep : మన శరీరానికి నిద్ర ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నిద్ర పోవడం వల్ల శరీరం రీచార్జ్ అవుతుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం తన లోపల ఉన్న లోపాలకు గాను మరమ్మత్తులు చేసుకుంటుంది. ఇంకా ఎన్నో పనులు మనం నిద్ర పోవడం వల్ల జరుగుతాయి. అయితే ఎప్పుడైతే రోజూ సరిపడా నిద్రపోమో అప్పుడు మనకు అనారోగ్యాలు వస్తుంటాయి. ఇది సరే.. మరి నిరంతరాయంగా కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది..? అసలు అలా ఉండగలమా..? ఉంటే పిచ్చి వారవుతారా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషికి కచ్చితంగా నిద్ర కావల్సిందే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. నిద్ర పోకుండా ఎవరైనా నిరంతరాయంగా 3 రోజులకు మించి ఉండలేరు. ఆ తరువాత నిద్ర వస్తూనే ఉంటుంది. ఏ పని చేసినా, పగలైనా, రాత్రయినా నిద్ర వస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు నిద్రపోకపోతే శరీరం బాగా అలసిపోతుంది. కచ్చితంగా విశ్రాంతి కోరుకుంటుంది. అయితే ఇది సరే.. మరి నిరంతరాయంగా కొన్ని రోజుల పాటు నిద్ర పోకుండా ఉండలేమా..? అంటే ఉండలేం. అది ఎవరికీ సాధ్యం కాని పని. ర్యాండీ గార్నర్ అనే వ్యక్తి వరుసగా 11 రోజుల పాటు నిద్ర పోలేదు. దీంతో అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కింది. ఇక అంత కన్నా ఎక్కువ రోజులు నిద్ర పోకుండానైతే ఎవరూ లేరు. కనుక కచ్చితంగా ఏదో ఒక రోజున ఎవరైనా నిద్ర పోతారు. లేదంటే మృత్యువు బారిన పడతారు. ఇది మేం చెబుతోంది కాదు, డాక్టర్లు చెబుతున్నదే.
ఇక అలా కొన్ని రోజుల పాటు నిద్ర పోకుండా ఉన్నవారు పిచ్చి వారుగా మారుతారా..? అంటే.. మారరు. అవును, అలా ఎవరూ మారరు. దీన్ని సైంటిస్టులే నిర్దారించారు. వారు కొందరు మనుషులపై చేసిన ప్రయోగాలను బట్టి ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే నిరంతరాయంగా కొన్ని రోజుల పాటు నిద్రపోని వారు పిచ్చివారు కారు, కానీ.. అలాంటి వారికి నిజ జీవితంలోనూ కలలు వస్తాయట. అంటే.. పగలైనా, ఆ సమయంలో ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ నిద్ర పోయినప్పుడు కన్నట్టు కలలు కంటారట. అవును, ఈ విషయాన్ని కూడా సైంటిస్టులే నిర్దారించారు. ఏది ఏమైనా నిద్ర గురించిన ఈ విషయం భలే ఆశ్చర్యంగా ఉంది కదా. బహుశా పగటి కలలు అనే పదానికి కరెక్ట్ అర్థం ఇదేనేమో..!