Bread Paneer Garelu : బ్రెడ్‌, ప‌నీర్ క‌లిపి కూడా గారెలు చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?

Bread Paneer Garelu : గారెలు అంటే అంద‌రికీ ఇష్ట‌మే. వీటిని వివిధ ర‌కాల ప‌దార్థాల‌తో చేస్తుంటారు. మినప ప‌ప్పు, పెస‌లు, బొబ్బ‌ర్లు.. ఇలా ప‌లు ర‌కాల ప‌ప్పుల‌తో వీటిని చేస్తారు. అయితే బ్రెడ్‌, ప‌నీర్‌ల‌ను ఉప‌యోగించి కూడా గారెల‌ను చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి. వీటిని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బ్రెడ్ ప‌నీర్ గారెల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ప‌నీర్ గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైస్ లు – 6, పెరుగు – ముప్పావు క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, ప‌నీర్ తురుము – అర క‌ప్పు, ఉడికించిన ఆలుగ‌డ్డ‌ల ముద్ద – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ఉల్లిపాయ త‌రుగు – పావు క‌ప్పు, అల్లం త‌రుగు – 1 టీస్పూన్‌, కొత్తిమీర – క‌ట్ట‌, పచ్చి మిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

Bread Paneer Garelu recipe in telugu make in this method
Bread Paneer Garelu

బ్రెడ్ ప‌నీర్ గారెల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా బ్రెడ్ స్లైస్ ల‌ని ముక్క‌లుగా కోసి ఆ త‌రువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు వెడ‌ల్పాటి గిన్నెను తీసుకుని అందులో నూనె త‌ప్ప ఒక్కో ప‌దార్థాన్ని బ్రెడ్ పొడితో స‌హా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించుకుని తింటే చాలు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటి టేస్ట్‌ను చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు. అంద‌రికీ ఎంతగానో న‌చ్చుతాయి.

Share
Editor

Recent Posts