చీపుర్లని మనం ఎందుకు ఉపయోగిస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీపురిని ఆఫీసు, ఇల్లు లేదా దుకాణం, రోడ్లు ఇలా అనేక ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే హిందూ మతంలో ఈ చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అయితే చీపురు ఉపయోగించిన తర్వాత ఎక్కడ బడితే అక్కడ ఎలా బడితే అలా పెట్టడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. చీపురు కదా అంటూ ఆ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం కలిగి ఉంటుందట.గురువారం ఒక్క చిన్న బంగారు చీపురుని తీసుకుని దానిని పూజా మందిరంలో కొన్ని రోజులు ఉంచి పూజించండి. అనంతరం ఆ బంగారు చీపురిని ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉంటుంది.
ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటే.. ఆ ఇంటిని గురువారం చీపురుతో శుభ్రం చేసి .. తర్వాత నీటితో శుభ్రంగా కడగండి. అనంతరం ఇంట్లోని అన్ని గదుల్లో గంగాజలం చల్లండి. ఇలా చేయడం వలన ఇంట్లోవారురోగాలబారిన పడరు.ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. పాత సామాన్లుఇంట్లో పాత సామాన్లు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక వాటిని తీసేస్తే మంచిది.వాస్తు ప్రకారం చీపురుని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టి ఉంచే చీపురు అశుభంగా భావిస్తారు. అందుకే చీపురును ఎప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి. చీపురును ఎప్పుడూ కిచెన్ లో ఉంచకూడదంట. కిచెన్‌లో చీపురుంచడం వల్ల ఇంట్లో అన్నం కొరత ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలి. బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. అందరి దృష్టీ అటే వెళ్తుంది. ఇతరుల దృష్టి పడనిచోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. చీపురు పాడైతే వెంటనే కొత్తది మార్చేయాలి. పాడైన చీపురుతో ఇళ్లు శుభ్రం చేస్తే..చాలా సమస్యలు ఎదురౌతాయి.పాత చీపురును తీసేసి..శనివారం నాడు ఇంట్లోకి కొత్త చీపురు తెచ్చుకోవాలి. సాయంత్రం సమయంలో చీపురుతో తుడిస్తే..లక్ష్మీదేవికి అలుగుతుందంటారు. సూర్యాస్తమయం తరువాత ఏదైనా కారణంతో చీపురుతో తుడవాల్సి వస్తే..మట్టి, చెత్తను ఇంట్లోనే ఉంచుకోవాలి. బయట పారవేయకూడదు. చీపురును నార్త్‌ఈస్ట్‌లో పొరపాటున కూడా ఉంచకూడదు. లేకపోతే..ఇంట్లోకి సంపద రాదంట. అందుకే చీపురుని పశ్చిమం లేదా దక్షిణ దిశలోనే ఉంచాలి.