technology

BSNL రీచార్జ్ ప్లాన్ అదిరిందిగా.. రూ.300 క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే..!

ఇటీవ‌ల బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి చాలా ద‌గ్గ‌ర అవుతుంది. బెస్ట్ ప్లాన్స్ ఇంట్ర‌డ్యూస్ చేస్తూ మార్కెట్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు సగం ధరకే వస్తున్నాయి. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నమ్మశక్యం కాని ధరలో 52 రోజుల చెల్లుబాటును ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ రూ. 298 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు అదిరిపోయే ఆప్ష‌న్. ఈ ప్లాన్ 52 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. రీఛార్జ్ ఖర్చులపై ఇది గణనీయమైన పొదుపును అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు. ఇది వాయిస్ కాల్‌లు, SMSలకు ప్రాధాన్యత ఇచ్చే వారికి బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్ప‌వచ్చు.. రూ. 298 రీఛార్జ్ ప్లాన్ మొత్తం చెల్లుబాటు వ్యవధికి (52 రోజులు) 52GB డేటాను అంటే.. రోజుకు 1GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.వినియోగదారులు వారి రోజువారీ డేటా పరిమితి పూర్తి అయిన తరువాత, 100 ఉచిత SMS సందేశాలను ఉపయోగించుకోవచ్చు. రూ. 298 రీఛార్జ్ ప్లాన్.. డేటా అంతగా అవసరం లేని వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మొబైల్‌ని వాయిస్ కాల్‌లు, అప్పుడప్పుడు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్ అద్భుతమైనది. అయితే మరింత డేటా అవసరమైన వారు రూ. 249 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

bsnl new recharge plan that offers for less than 300

ఇది 45 రోజుల వాలిడిటీతో వ‌స్తుంది. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. తక్కువ ధరతో లాంగ్-వాలిడిటీని అందించడం ద్వారా, బీఎస్ఎన్ఎల్ దాని పోటీదారులైన ప్రైవేట్ టెలికాం కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది. ఎక్కువ మంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే రీఛార్జ్ ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉన్నందున, బీఎస్ఎన్ఎల్ 52-రోజుల రీఛార్జ్ ప్లాన్ భారతీయ టెలికాం మార్కెట్లో గేమ్-ఛేంజర్‌గా మారవచ్చు అని అంటున్నారు.ఇంకా రానున్న రోజుల‌లో మ‌రిన్ని ఆఫ‌ర్స్ కూడా బీఎస్ఎన్ఎల్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు.

Sam

Recent Posts