Carrot Vepudu : క్యారెట్ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Carrot Vepudu : విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ ను మ‌నమంద‌రం ఆహారంగా తీసుకుంటాము. క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటిచూపును మెరుగున‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యారెట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. క్యారెట్ ను ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు దీనితో ఫ్రై వంటి వాటిని కూడా త‌యారు చేస్తారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ క్యారెట్ ఫ్రైను మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా కొబ్బ‌రి, వెల్లుల్లి కారం వేసి చేసే క్యారెట్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, అంద‌రికి న‌చ్చేలా క్యారెట్ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన క్యారెట్ – పావుకిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8. కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Carrot Vepudu recipe very tasty with rice
Carrot Vepudu

క్యారెట్ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, కారం, ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు వేసి మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క్యారెట్ ముక్క‌లను వేయించాలి. క్యారెట్ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ వేపుడు త‌యార‌వుతుంది. అన్నంతో ఈ క్యారెట్ వేపుడును తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts