Arugula Plant Benefits : అరుగులా.. మనం తీసుకోదగిన ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి. దీనిని గార్డెన్ రాకెట్, రుకోలా, రోక్వేట్ అని కూడా పిలుస్తారు. చెప్పాలంటే మనలో చాలా మందికి ఇది తెలియదు. దీనిని ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే దీనిని ఎక్కువగా సలాడ్ రూపంలోనే తీసుకుంటారు. అరుగులా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు అరుగులా లో ఉన్నాయి. ఇతర ఆకుకూరల వలె అరుగులా కూడా మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో దోహదపడుతుంది.
అరుగులాను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అరుగులాను తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అరుగులా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అరుగులాను తీసుకోవడం వల్ల మన శరీరం మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను ఎక్కువగా గ్రహించగలుగుతుంది.
అంతేకాకుండా ఎముకలకు కూడా అరుగులా ఎంతో మేలు చేస్తుంది. అరుగులాను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అరుగులాలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు అరుగులాను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వ్యాయామం చేసే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా అరుగులా చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ విధంగా అరుగులా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.