Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

Potato For Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా మార్చే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ఉల్లిపాయ ర‌సాన్ని, బంగాళాదుంప ర‌సాన్ని, నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా మ‌ధ్య‌స్థంగా ఉండే ఉల్లిపాయ‌ను తీసుకుని దానిని ముక్క‌లుగా చేయాలి. త‌రువాత మ‌ధ్య‌స్థంగా ఉండే బంగాళాదుంప‌ను తీసుకుని దానిపై ఉండే చెక్కును తీసి ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌ల‌ను, బంగాళాదుంప ముక్క‌ల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం నుండి ర‌సాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. ఆరిన త‌రువాత షాంపు వాడ‌కుండా త‌లస్నానం చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించిన మ‌రుస‌టి రోజు షాంపుతో త‌ల‌స్నానం చేయాలి.

Potato For Hair works effectively know how to use it
Potato For Hair

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ప‌లుచ‌గా మారిన మ‌న జుట్టును ఒత్తుగా మార్చుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌, బంగాళాదుంప‌లో మ‌న జుట్టు పెరుగుద‌లకు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌లో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చుండ్రు, త‌ల‌లో దుర‌ద వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వారానికి రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. జుట్టు రాలే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts