Chai Masala Powder : ఈ చాయ్ మసాలా.. మిమ్మ‌ల్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Chai Masala Powder : మ‌న‌లో చాలా మందికి టీ ని తాగే అల‌వాటు ఉంది. చాలా మంది టీ ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. రోజుకు నాలుగు నుండి ఐదు క‌ప్పుల టీ ని తాగే వారు కూడా ఉన్నారు. టీ తాగ‌క‌పోతే రోజూ గ‌డ‌వ‌దు అని భావించే వారు కూడా ఉన్నారు. టీ ని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. శ‌రీర బ‌డ‌లిక త‌గిన‌ట్టు ఉంటుంది. చాలా మంది త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు టీ ని తాగుతూ ఉంటారు. ఈ టీ ని వివిధ రుచుల్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న ఇంట్లో ఉండే మ‌సాలా దినుసుల‌తో ఒక చ‌క్క‌టి మ‌సాలా పొడిని త‌యారు చేసుకుని టీ లో వేసుకోవ‌డం వ‌ల్ల టీ రుచి మ‌రింత పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఇలా త‌యారు చేసుకున్న టీ ని తాగ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

మ‌సాలా టీ త‌యారీకి కావ‌ల్సిన మ‌సాలా పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ‌సాలా పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ముందుగా ఒక క‌ళాయిలో 20 గ్రాముల యాల‌కుల‌ను వేయాలి. త‌రువాత ఇందులో 10 గ్రాముల దాల్చిన చెక్క‌ను వేయాలి. త‌రువాత 2 టేబుల్ స్పూన్ల సోంపును, 10 గ్రాముల న‌ల్ల మిరియాల‌ను, 8 గ్రాముల ల‌వంగాల‌ను వేయాలి. త‌రువాత 5 న‌ల్ల యాల‌కుల‌ను తీసుకుని వాటిని దంచాలి. త‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసి వేసుకోవాలి. త‌రువాత ఒక జాజికాయ‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై ఈ మ‌సాలా దినుసుల‌ను చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

Chai Masala Powder how to make it know the method
Chai Masala Powder

ఈ దినుసుల‌న్నీ చ‌ల్లారిన త‌రువాత వీటిని జార్ లో వేసుకుని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఇందులోనే 50 గ్రాముల ప‌టిక బెల్లం ముక్క‌ల‌ను, 10 గ్రాముల అతి మ‌ధురం పొడిని, 10 గ్రాముల శొంఠి పొడిని వేసి మ‌రోసారి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే టీ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉండ‌డంతో పాటు వాస‌న కూడా పోకుండా ఉంటుంది. ఇలా త‌యారు చేసుకున్న మ‌సాలా పొడితో త‌యారు చేసిన టీ చాలా రుచిగా, చ‌క్క‌టి వాస‌న క‌లిగి ఉంటుంది. అలాగే ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఒంటి నొప్పులు త‌గ్గుతాయి.

త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అలాగే జ్వ‌రం, ద‌గ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌ర వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ మ‌సాలా పొడితో టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ఒక టేబుల్ స్పూన్ టీ పౌడ‌ర్ ను వేయాలి. త‌రువాత ఒక టీ స్పూన్ పంచ‌దార వేసి 2 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఒక క‌ప్పు పాల‌ను పోసి పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత పావు టీ స్పూన్ ముందుగా త‌యారు చేసుకున్న చాయ్ మ‌సాలా పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ టీ ని మ‌రో నిమిషం పాటు మ‌రిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉండే మ‌సాలా టీ త‌యార‌వుతుంది. ఈ విధంగా మ‌సాలా టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts