Chana Dal Masala : చ‌పాతీ, రైస్‌లోకి చిక్క‌ని గ్రేవీతో చ‌నా దాల్ మ‌సాలా.. ఇలా చేయాలి..!

Chana Dal Masala : మ‌నం శ‌న‌గ‌పప్పును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌న‌గ‌ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. పిండి వంట‌లల్లో, తాళింపులో వాడ‌డంతో పాటు శ‌న‌గ‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పు చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే చ‌నా దాల్ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌నా దాల్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన శ‌న‌గ‌పప్పు -ఒక క‌ప్పు, ట‌మాటాలు – 4, నీళ్లు – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టీ స్పూన్స్, సన్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – 3, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క‌, బిర్యానీ ఆకు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కాశ్మీరి కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి- పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మసాలా -ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chana Dal Masala recipe in telugu make in this method
Chana Dal Masala

చ‌నా దాల్ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో శ‌న‌గ‌పప్పు, నీళ్లు, ఉప్పు వేసి ఉడికించాలి. శ‌న‌గ‌ప‌ప్పు 90 శాతం ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత తీసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో ట‌మాటాలు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఉల్లిపాయ‌లు, ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, కాశ్మీరి కారంతో పాటు మిగిలిన పొడుల‌న్నీ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉడికించిన శ‌న‌గ‌పప్పు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించిన తరువాత శ‌న‌గ‌ప‌ప్పు ఉడికించిన నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత బ‌ట‌ర్, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌నా దాల్ మ‌సాలా కర్రీ త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ శ‌న‌గ‌ప‌ప్పు ట‌మాట కూర‌ను కాకుండా ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తినవ‌చ్చు.

D

Recent Posts