Chandra Grahan 2022 : నవంబర్ 8 వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం ఎంతో పవిత్రమైన శక్తివంతమైన చంద్రగ్రహణం. ఈ రోజున గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి యొక్క జీవితం మారబోతుంది. ఎంతటి మార్పు అంటే అస్సలు ఊహించని విధంగా ఈ నాలుగు రాశుల వారి తలరాత మారి అదృష్టపట్టబోతుంది. కోట్లకు పడగలు ఎత్తబోత్తున్నారు. వీరి యొక్క అదృష్టం ఎలా ఉండబోతుందంటే కనుక ఇంతక ముందు వీరి జీవితం ఇప్పుడు అన్నట్టుగా మారబోతుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ నాలుగు రాశుల వారు ఏది చేద్దామని తలపెట్టిన అందులో విజయమే తప్ప అపజయం ఉండదు. ఈ 2022 వ సంవత్సరం నవంబర్ 8 న తేదీన మంగళవారం వచ్చింది. ఈ రోజున రాహు గ్రస్థ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఈ సందర్భంగా అఖండ రాజయోగం పట్టబోతున్న ఈ నాలుగు రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2022 నవంబర్ 8 వ తేదీ కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం 2:38 నిమిషాలకు రాహుగ్రస్థ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం మనకు భరణి నక్షత్రం మూడవ పాదం మేషరాశి లో ఏర్పడబోతుంది. కావున అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడకూడదు. రాశులపరంగా మేష రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ చంద్రగ్రహణ్ చూడరాదు. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణం కనిపించే కాలం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలు. సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కనుక ఈ గ్రహణం ఎక్కువగా కనబడదు. అయినప్పటికి పట్టు స్నానాన్ని గ్రహణం ప్రారంభమవ్వగానే ఆచరించాలి. సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు విడుపు స్నానాన్ని ఆచరించాలి. ఈ గ్రహణం మొత్తం కూడాను 3 గంటల 40 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం ఘోచారం ప్రకారం జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు వచ్చేటటు వంటి 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం సంభవిస్తే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలుగజేస్తుంది. జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు వచ్చే 2,5, 7,9 రాశుల్లో గ్రహణం సంభవిస్తే ఈ గ్రహణం మంచి ఫలితాలను కలుగజేస్తుంది. అదే విధంగా జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు 3, 6, 10,11 స్థానాల్లో గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలను కలుగుజేస్తుంది.
ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని కలుగజేసే నాలుగు రాశుల్లో మొదటిది కుంభ రాశి. నవంబర్ 8 వ తేదీన వచ్చేటటువంటి ఈ చంద్రగ్రహణం కుంభ రాశి వారికి విపరీతమైన రాజయోగాన్ని కలుగజేస్తుంది. దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుండి చూసినప్పుడు గ్రహణం సంభవించేటటువంటి మేష రాశి మూడవ రాశి అవుతుంది. మన జన్మ రాశి నుండి మూడవ రాశిలో గనుక గ్రహణం వస్తే అది అఖండ రాజయోగం అవుతుంది. కాబట్టి కుంభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. అలాగే అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కూడా చంద్రగ్రహణం బ్రహ్మాండ రాజయోగాన్ని కలిగిస్తుంది. దానికి కారణం జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు 6 వ రాశిలో గ్రహణం వస్తే అది రాజయోగం. గ్రహణం సంభవించేటటువంటి మేష రాశి వృశ్చిక రాశి నుండి 6 వ రాశి అవుతుంది. ఈ రాశి వారికి గ్రహణం 6 వ రాశిలో ఏర్పడుతుంది కనుక ఈ రాశి వారికి చంద్రగ్రహణం విపరీత రాజయోగాన్ని కలిగించబోతుంది.
చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి కర్కాటక రాశి. ఈ రాశి నుండి లెక్కపెట్టినప్పుడు గ్రహణం ఏర్పడే మేష రాశి 10 వ రాశి అవుతుంది. జన్మ రాశి నుండి 10 వ రాశిలో గ్రహణం సంభవిస్తే అఖండ రాజయోగం పడుతుంది. ఇక చంద్రగ్రహణం విపరీత రాజయోగాన్ని కలిగించే నాలుగ రాశి మిధునరాశి. ఈ రాశి నుండి లెక్కపెట్టినప్పుడు గ్రహణం సంభవించే మేష రాశి 11 వ రాశి. జన్మ రాశి నుండి 11 వ రాశి అయినటువంటి మేష రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కనుక మిధున రాశి వారికి కూడాను విపరీతమైన రాజయోగాన్ని ఈ చంద్రగ్రహణం కలుగజేస్తుంది. ఈ నాలుగు రాశుల వారు కూడా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఎప్పుడు కూడా గ్రహణ ఘోచారం వల్ల వచ్చే ఫలితాలు 6 నెలల పాటు అద్భుతంగా పని చేస్తాయి. గ్రహణం ఇచ్చే ఫలితం ఎటువంటి పలితమైనా ఆరు నెలల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది. కావున ఈ నాలుగు రాశుల వారికి చంద్రగ్రహణం 6 నెలల పాటు అద్భుతమైన ఫలితాలను కలుగజేస్తుంది.