Custard Apple Side Effects : చలికాలంలో ఎక్కువగా లభించే ఫలాల్లో సీతాఫలం ఒకటి. దీని రుచిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ సీతాఫలాలు చలికాలంలో ప్రారంభం కాగానే మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. సీతాఫలాల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండును తినడం వల్ల నోట్లో జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బాగా పండిన సీతాఫలం మరింత రుచిగా ఉంటుంది. సీతాఫలం పండుతో పాటు ఆ చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి సీతాఫలానికి ఉంది. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనం వాతావరణ మార్పుల కాఱంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సీతాఫలం లభించే కాలంలో దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సంవత్సరమంతా రోగాల బారిన పడకుండా ఉంటాం. కంటిచూపును మెరుగుపరచడంలో, జీర్ణశక్తి సాఫీగా సాగేలా చేయడంలో సీతాఫలం చాలా ఉపయోగపడుతుంది. సీతాఫలాన్ని తినడం వల్ల జుట్టు మరియు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె సంబంధిత సమస్యలను మన దరి చేరకుండా చేస్తుంది.
ఇందులో ఉండే పొటాషియం కండరాలకు నూతనోత్తేజాన్ని కలిగించి ముభావం అనే భావనను తగ్గిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే బద్దకాన్ని తగ్గించడంలో ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీతాఫలాన్ని తినడం వల్ల మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బరువు పెరగాలని ప్రయత్నించే వారికి సీతాఫలం వారు శీతాకాలం పొడవునా ఒక సీతాఫలాన్ని తినడం వల్ల మేలు కలుగుతుంది. ఈ పండు గింజలను పొడిగా చేసి వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి రాయడం వల్ల వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా సీతాఫలం ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక పావు టీ స్పూన్ సీతాఫలం చెట్టు వేరు పేస్ట్ ను వేసి కలిపి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు సీతాఫలాన్ని తినడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. దంతక్షయాన్ని, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా సీతాఫలానికి ఉంది. ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి కదా అని వీటిని ఎక్కువగా తినకూడదు. సీతాఫలాలు ఎక్కువగా తినడం వల్ల లావుగా ఉన్న వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిని ఎక్కువ మోతాదులో అజీర్తి, అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంటి చూపు సమస్యలు, మానసిక సమస్యలు, కడుపు నొప్పి, ప్రేగు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సీతాఫలాలను తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.