Chicken Bajji : మిర్చి బ‌జ్జీ మాత్ర‌మే కాదు.. చికెన్ బ‌జ్జీలు కూడా చేసుకోవ‌చ్చు.. రుచి అద్బుతంగా ఉంటాయి..

Chicken Bajji : చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే.. స‌హ‌జంగానే చాలా మందికి న‌చ్చుతుంది. చికెన్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ.. వంటివి చేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. ఏదో ఒక చికెన్ వెరైటీని చేస్తుంటారు. నాన్‌వెజ్ ప్రియులు అధికంగా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. అయితే చికెన్‌తో ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కేవ‌లం మిర్చి బ‌జ్జీలు మాత్ర‌మే కాదు.. చికెన్ బ‌జ్జీల‌ను కూడా మ‌నం చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌లుచ‌ని స్లైస్‌ల‌లా కోసిన చికెన్ ముక్క‌లు – పావు కిలో, శ‌నగ పిండి – ఒక క‌ప్పు, మొక్క‌జొన్న పిండి (కార్న్ ఫ్లోర్‌) – రెండు టీస్పూన్లు, బియ్యం పిండి – రెండు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా.

Chicken Bajji recipe in telugu very easy method follow these steps
Chicken Bajji

చికెన్ బ‌జ్జీల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా చికెన్ ముక్క‌ల‌పై ప‌సుపు, ఉప్పు, కారం వేసి వాటికి అవ‌న్నీ ప‌ట్టేలా క‌లిపి గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ త‌రువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, మొక్క‌జొన్న పిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద‌, గ‌రం మ‌సాలా, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోస్తూ బ‌జ్జీల పిండిలా చేసుకోవాలి. ఇందులో చికెన్ ముక్క‌ల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించి తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చికెన్ బ‌జ్జీలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్‌తో ఎల్ల‌ప్పుడూ రొటీన్‌గా చేసే వంట‌కాలు కాకుండా ఈసారి ఇలా కొత్త‌గా ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది.

Editor

Recent Posts