Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇలా వండారంటే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Chicken Curry : మ‌నం తినే మాంసాహార వంట‌కాల‌లో చికెన్ క‌ర్రీ ఒక‌టి. మాంసాహార ప్రియుల‌కు చికెన్ క‌ర్రీ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ క‌ర్రీని ఎలా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా, చిక్క‌గా ఉండే చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Chicken Curry will be very delicious if you cook in this way
Chicken Curry

చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ఒక కిలో, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్‌, ఎండు మిర‌ప‌కాయ‌లు – 7, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – కొద్దిగా, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 (పెద్ద‌వి), పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, అల్లం వెల్లులి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్‌, ప‌సుపు – అర టీ స్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కారం – ఒక టీ స్పూన్‌, పెరుగు – ఒక టేబుల్ స్పూన్‌, ట‌మాటాలు – 2, నీళ్లు – రెండు గ్లాసులు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను బాగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. త‌రువాత ట‌మాటాల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో ధ‌నియాలు, మిరియాలు, సోంపు గింజ‌లు, జీల‌క‌ర్ర‌, ఎండు మిర‌ప‌కాయ‌లు, ఒక రెబ్బ క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక యాల‌కులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ఉల్లిపాయ‌లు, త‌రిగిన ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత చికెన్‌, ప‌సుపు, కొద్దిగా ఉప్పును వేసి క‌లిపి, చికెన్ బాగా ఉడికే వ‌ర‌కు వేయించుకోవాలి.

చికెన్ ఉడికిన త‌రువాత కారం, పెరుగు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాటాల గుజ్జు వేసి బాగా క‌లిపి, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. త‌రువాత మ‌ధ్య‌స్థ మంట‌పై ముందుగా పొడిలా మిక్సీ ప‌ట్టుకున్న ఎండు మిర‌ప‌కాయ‌ల మిశ్ర‌మం, రుచికి స‌రిప‌డా మ‌రికొద్దిగా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి, మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తరువాత మూత తీసి కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. ఈ చికెన్ క‌ర్రీ వేడిగా ఉన్న‌ప్పుడు ప‌లుచ‌గా ఉంటుంది. అయితే చ‌ల్ల‌గా అయ్యే స‌రికి చిక్క‌గా అవుతుంది. ఈ చికెన్ క‌ర్రీని అన్నం, చ‌పాతీ, రోటీ, పూరీ, రాగి సంగ‌టి వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts