Madras Style Paratha Kurma : మ‌ద్రాస్ స్టైల్‌లో ప‌రాటా కుర్మా త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Madras Style Paratha Kurma : మ‌ద్రాస్ స్టైల్ ప‌రాటా కుర్మా.. ప‌రాటాల‌ను తిన‌డానికి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాతో ప‌రాటాల‌ను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మ‌నం త‌రుచూ చేసే ప‌రాటా కుర్మా కంటే ఈ విధంగా త‌యారు చేసిన ప‌రాటా కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ సమ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ప‌రాటా కుర్మాను మ‌ద్రాస్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌రాటా కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి తురుము – ఒక క‌ప్పు, గ‌స‌గ‌సాలు -ఒక టేబుల్ స్పూన్, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, మ‌రాఠీ మొగ్గ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వేడి నీటిలో నాన‌బెట్టిన ప‌చ్చి బ‌ఠాణీ – అర క‌ప్పు, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 10, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – 400 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Madras Style Paratha Kurma recipe in telugu make in this way
Madras Style Paratha Kurma

ప‌రాటా కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌చ్చికొబ్బ‌రి తురుము, గ‌స‌గ‌సాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాతకుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్తబ‌డిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌చ్చిబ‌ఠాణీ వేసుకోవాలి.

త‌రువాత మిగిలిన కూర‌గాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి కల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ పెద్ద మంట‌పై 3 విజిల్స్ చిన్న మంట‌పై వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌రాటా కుర్మా త‌యార‌వుతుంది. దీనిని ప‌రాటాల‌తో పాటు చ‌పాతీ, పూరీ, దోశ వంటి వాటితో కూడా తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts