Chinese Chilli Egg : చైనీస్ స్టైల్‌లో చిల్లీ ఎగ్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. అస‌లు వ‌ద‌ల‌రు..!

Chinese Chilli Egg : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లోల‌భించే వాటిల్లో చైనీస్ చిల్లీ ఎగ్ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఈ చిల్లీ ఎగ్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు, వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే చైనీస్ చిల్లీ ఎగ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. కోడిగుడ్డు తినని పిల్ల‌ల‌కు ఇలా స్పెష‌ల్ గా చేసి పెట్ట‌డం వ‌ల్ల వారు కూడా ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చైనీస్ చిల్లీ ఎగ్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

చైనీస్ చిల్లీ ఎగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – కొద్దిగా, బీట్ చేసుకున్న కోడిగుడ్డు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన వెల్లుల్లి రెమ్మ‌లు – 4, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ట‌మాట కిచ‌ప్ – 2 టీ స్పూన్స్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, పంచ‌దార – పావు టీ స్పూన్, ఆరోమేటిక్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, క్యాప్సికం పెట‌ల్స్ – 10 నుండి 15, ఉల్లిపాయ పెటెల్స్ – 10 నుండి 15, నీళ్లు – 100 ఎమ్ ఎల్.

Chinese Chilli Egg recipe in telugu make in this method
Chinese Chilli Egg

చైనీస్ చిల్లీ ఎగ్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బీట్ చేసిన ఎగ్ వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి జారుడుగా పిండిని క‌లుపుకోవాలి. త‌రువాత కోడిగుడ్ల‌ను నిలువుగా 4 ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని పిండిలో ముంచి వేడైన నూనెలో వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మంట‌ను పెద్ద‌గా చేసి వెల్లుల్లి రెమ్మ‌లు, అల్లం త‌రుగు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ త‌రుగు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత సాసెస్ తో పాటు పొడుల‌న్నీ వేసి క‌ల‌పాలి.

వీటిని నూనె పైకితేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత క్యాప్సికం, ఉల్లిపాయ పెటెల్స్ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి కల‌పాలి. దీనిని చిక్క‌బడే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత వేయించిన కోడిగుడ్డు ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటికి సాసెస్ అన్ని ప‌ట్టేలా క‌లుపుకుని పైన త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చైనీస్ చిల్లీ ఎగ్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా ఇంట్లోనే చాలాసుల‌భంగా చైనీస్ చిల్లీ ఎగ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts