వినోదం

Chiranjeevi : చిరంజీవి చేసిన ప‌నికి రోజంతా ఎండ‌లో నిల‌బెట్టార‌ట‌.. ఎందుకు..?

Chiranjeevi : సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోల‌తో పోలిస్తే చిరంజీవి క్రేజ్ ప్ర‌త్యేకం అనే చెప్పాలి. సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. 1978 లో ప్రాణం ఖ‌రీదు అనే సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేసిన చిరంజీవి ఆ త‌రువాత విభిన్న క‌థా చిత్రాల‌తో మెప్పించాడు. కెరీర్ పరంగా ఎదగాలనే ఉద్దేశంతో చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

చిరంజీవి హీరోగా వాణి తమ్మారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలుగా కె.వాసు డైరెక్షన్ లో కోతల రాయుడు అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక రోజు చిరంజీవి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారని చిరంజీవిపై నిర్మాతలకు పట్టరని కోపం వచ్చిందట. చిరంజీవిని రోజంతా ఎండలో నిలబడాలని నిర్మాతలు చెప్పగా చిరంజీవి మరో మాట మాట్లాడకుండా రోజంతా ఎండలో నిలబడ్డారని తులసి పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో తులసి చిన్న పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో మాధ‌వి హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాకు చిరంజీవి ఎలాంటి రెమ్యున‌రేష్ తీసుకోక‌పోవ‌డం విశేషం.

chiranjeevi standed in sun for his mistake

కోత‌ల రాయుడు సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందు ఎన్టీరామారావు, ర‌జినీకాంత్ హీరోలుగా న‌టించిన టైగ‌ర్ అనే సినిమా విడుద‌లైంది. ఈ సినిమా థియేట‌ర్ ల‌లో అప్ప‌టికే ర‌న్ అవుతుండడంతోపాటు ఎన్టీఆర్, బాల‌కృష్ణ క‌లిసి న‌టించిన శ్రీ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణం సినిమా కూడా అప్పుడే విడుద‌లైంది. ఇలా రెండు బ‌డా సినిమాల మ‌ధ్య చిరంజీవి సినిమా కోత‌ల రాయుడు విడుద‌ల కాగా ఈ సినిమా విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా వంద రోజులు ఆడింది. ఈ చిత్రానికి అప్ప‌ట్లో క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది. అలా ఎన్‌టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌ల‌ను త‌ట్టుకుని కూడా చిరంజీవి సినిమా బంప‌ర్ హిట్ అవ‌డం విశేషం అనే చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts