Cleaning Home : మనం ప్రతి రోజూ ఇంటిని ఊడ్చి, తడి గుడ్డతో తుడిచి శుభ్రం చేస్తూ ఉంటాం. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనందరికీ తెలుసు. లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటిని ప్రతిరోజూ తడి బట్టతో తుడవకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మాత్రమే ఇంటిని శుభ్రపరచాలి. ఈ రోజులలో ఇంటిని శుభ్రం చేయడం వల్ల లక్ష్మీ దేవి స్థిరంగా మన ఇంట్లోనే ఉంటుంది. పైగా ధనం సంపాదిస్తారు. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. డబ్బు ఖర్చు కాదు. చేతిలో నిల్వ ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును, పసుపును వేసి శుభ్రం చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందవచ్చు.
ఇలా శుభ్రం చేసిన తరువాత ఇంట్లో గిన్నెలలో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో నాలుగు మూలలా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేయడం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు.